భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రపురం శివారులో 82 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు గురువారం పట్టుకున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని సమాచారంతో రెండు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నామని సివిల్ సప్లై జిల్లా ఆఫీసర్ ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు.
ఈ క్రమంలో రామచంద్రపురంలో నిర్మానుష్య ప్రాంతంలో రేషన్ బియ్యాన్ని తరలించేందుకు సిద్ధంగా ఉంచారని తెలియడంతో దాడులు చేశామన్నారు. నరసింహారావు అనే వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లుగా గుర్తించి, అతని ఇంట్లో రెండు క్వింటాళ్ల బియ్యంతో పాటు వెయింగ్ మిషన్ ను స్వాధీనం చేసుకున్నామని, బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ కు తరలిస్తున్నామని పేర్కొన్నారు. నరసింహారావు పై క్రిమినల్ కేసు నమోదు చేయనున్నట్లు
స్పష్టం చేశారు.
