ఉదయం నుంచి కురుస్తున్న వర్షం.. పిడుగులు పడి 83 మంది మృతి

ఉదయం నుంచి కురుస్తున్న వర్షం.. పిడుగులు పడి 83 మంది మృతి

బీహార్‌లో పిడుగుల వర్షం కురుస్తోంది. ఈ ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వందలాది పిడుగులు పడ్డాయి. బీహార్‌లో ఎడ‌తెర‌పి లేకుండా ఉద‌యం నుంచి ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురువ‌డంతో దాదాపు అన్ని జిల్లాల్లో పిడుగుల పడ్డాయి. ఉద‌యం నుంచి మొదలైన మృతుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతూ సాయంత్రానికి 83కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ఒక‌ ప్రకటన విడుదల చేసింది. బీహార్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు ప‌డి 83 మంది మ‌ర‌ణించార‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

జిల్లాల వారీగా చూస్తే గోపాల్‌గంజ్‌లో అత్య‌ధికంగా 13 మంది పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. అలాగే నవాడాలో 8 మంది చనిపోయారు. శివన్ మరియు బాగల్ పూర్ లో ఆరుగురు మరణించారు. అసమ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, దర్భాంగా మరియు బంకాలో ఐదుగురు, బక్సర్‌లో నలుగురు, ఔరంగాబాద్‌లో ఇద్దరు, నలందలో ఇద్దరు, జుమ్రుయి స‌హా వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్క‌రు చొప్పున పిడుగుపాట్ల‌కు బ‌ల‌య్యారు. కాగా.. పిడుగుపాటుకు గురై చనిపోయిన వారి కుటుంబాలకు బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ తన సంతాపం వ్యక్త చేశారు. పిడుగుపాటుకు చనిపోయిన వారి ఒక్కొక్క‌రి కుటుంబాల‌కు రూ.4 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. కాగా.. బీహార్‌లో మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది.

బీహార్ విపత్తు పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ లో పిడుగులు పడి చాలా మంది మరణించారని తెలిసింది. అక్కడ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యులు చేపడుతున్నాయి. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితి గురించి తెలుసుకుంటున్నాం’ అని మోడీ ట్వీట్ చేశారు.

For More News..

వీడియో: లగ్జరీ కారులో మామిడి పండ్లు డెలివరీ చేస్తున్న సూపర్ మార్కెట్

వీడియో: రాజమండ్రిలో శానిటైజర్ తో మంటలు.. కాలిన బైక్..

బుల్లెట్ మీద నుంచి కిందపడ్డ హీరోయిన్