84శాతం ఫ్యామిలీల ఆదాయం తగ్గింది

84శాతం ఫ్యామిలీల ఆదాయం తగ్గింది

న్యూఢిల్లీ: లాక్ డౌన్ వల్ల మన దేశంలో అన్ని రంగాలూ ఇన్ కమ్ కోల్పోయాయి. ఏప్రిల్ లో 84శాతం కుటుంబాల ఆదాయం తగ్గిపోయింది. సాయమందితే తప్ప పూట గడవని పరిస్థితుల్లో చాలా కుటుంబాలు ఉన్నాయి. 34 శాతం కుటుంబాలైతే ఇతరుల సాయం లేకుండా ఒక్క వారం కంటే ఎక్కువ రోజులు బతుకు వెళ్లదీయలేని పరిస్థితిలో ఉన్నాయి. చికాగో బూత్స్ రస్టండీ సెంటర్ ఫర్ సోషల్ సెక్టార్ ఇన్నోవేషన్… సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) నుంచి సేకరించిన డేటాను విశ్లేషించి ఈ మేరకు వెల్లడించింది. సీఎంఐఈ ఏప్రిల్ లో దేశవ్యాప్తంగా 27 రాష్ర్టాల్లో 5,800 కుటుంబాలను సర్వే చేసింది. లాక్ డౌన్ వల్ల గ్రామీణ ప్రాంతాలే ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నాయని రీసెర్చర్లు పేర్కొన్నారు. లాక్ డౌన్ విధించిన మార్చి 25 నుంచి ఇప్పటి వరకు 10 కోట్ల మందికి పైగా జాబ్స్ కోల్పోయారని తెలిపారు. త్రిపుర, చత్తీస్ గఢ్, బీహార్, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాలపై తీవ్రమైన ప్రభావం పడిందని పేర్కొన్నారు. ఎక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల్లో తక్కువ శాతం ఫ్యామిలీల ఇన్ కమ్ తగ్గిందని రీసెర్చర్లు వెల్లడించారు.

రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చేస్తున్నయ్