బెంగాల్‌లో బీజేపీ అభ్యర్థిపై రాళ్లదాడి

బెంగాల్‌లో బీజేపీ అభ్యర్థిపై రాళ్లదాడి

వెస్ట్ మిడ్నాపూర్: బెంగాల్​లోని వెస్ట్ మిడ్నాపూర్ జిల్లా ఝార్గ్​రామ్ సీటు నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ప్రణత్ తుడుపై రాళ్ల దాడి జరిగింది. శనివారం మంగలపొట ఏరియాలోని ఓ పోలింగ్ బూత్ వద్ద ఆయనపై ఆందోళనకారులు రాళ్లు, ఇటుకలతో దాడి చేస్తూ తరిమారు. ఈ ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందికి గాయాలయ్యాయి. 

సెక్యూరిటీ సిబ్బంది షీల్డులతో ఆయనకు ప్రొటెక్షన్ ఇస్తుండగా.. అక్కడి నుంచి పారిపోతున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, అధికార తృణమూల్ కాంగ్రెస్ గూండాలే తనపై దాడికి దిగారని తుడు ఆరోపించగా.. పోలింగ్ బూత్ వద్ద తుడు సెక్యూరిటీ సిబ్బంది ఓ మహిళపై చేయి చేసుకోవడం వల్లే జనం తిరగబడ్డారని తృణమూల్ స్పష్టం చేసింది. కాగా, వెస్ట్ బెంగాల్​ లోని 8 నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.