IPL 2025: మరో ఆస్ట్రేలియన్ క్రికెటర్‌పై పాంటింగ్ గురి.. మ్యాక్స్ వెల్ స్థానంలో స్టార్ బ్యాటర్ కు ఛాన్స్

IPL 2025: మరో ఆస్ట్రేలియన్ క్రికెటర్‌పై పాంటింగ్ గురి.. మ్యాక్స్ వెల్ స్థానంలో స్టార్ బ్యాటర్ కు ఛాన్స్

ఐపీఎల్ 2025 లో పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాక్ తగలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ఐపీఎల్ 2025 సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. చేతి వేలి గాయం కారణంగా ఈ ఆసీస్ స్టార్ మిగిలిన సీజన్ కు దూరమయ్యాడు. బుధవారం (ఏప్రిల్ 30) చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో మ్యాక్సీ ఆడలేదు. మ్యాక్స్ వెల్ లాంటి స్టార్ ఆల్ రౌండర్ దూరం కావడంతో ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ఈ ఆసీస్ స్టార్ స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే డైలమాలో పడింది. ఐపీఎల్ తో పాటు సమాంతరంగా పాకిస్థాన్ సూపర్ లీగ్ జరగడంతో రీప్లేస్ చేయడానికి ఆటగాళ్లు కరువవ్వడమే ఇందుకు కారణం. 

మ్యాక్స్ వెల్ స్థానంలో పంజాబ్ హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న రికీ పాంటింగ్.. ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. స్మిత్ గత ఏడాది మేజర్ లీగ్ క్రికెట్ లో అదరగొట్టాడు. ఈ ఏడాది ప్రారంభంలోనూ సిడ్నీ సిక్సర్స్ తరపున సెంచరీతో మెరిశాడు. స్మిత్ ను తీసుకోవడం మంచి ఎంపికే అయినా పాంటింగ్ మీద విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే పంజాబ్ జట్టులో మార్కస్ స్టోయిన్స్, జోష్ ఇంగ్లిస్‌, బార్ట్ లెట్, మ్యాక్స్ వెల్ ఉంటే ఇప్పుడు మరో ఆసీస్ క్రికెటర్ ను పంజాబ్ జట్టులో చేర్చడానికి పాంటింగ్ ప్రయత్నాలు చేయడం ఎవరికీ నచ్చడం లేదు. పాంటింగ్ కావాలనే తమ క్రికెటర్లకు అవకాశం ఇస్తున్నాడని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

Also Read : బంగ్లాదేశ్‌తో సిరీస్ రద్దు చేసుకోనున్న టీమిండియా

మ్యాక్స్ వెల్ ఈ సీజన్ లో ఘోర ప్రదర్శన చేశాడు. మెగా ఆక్షన్ లో పంజాబ్ అతన్ని నమ్మి రూ. 4.2 కోట్లకు తీసుకుంటే గుజరాత్ టైటాన్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లోనే డకౌటయ్యాడు. ఆడిన తొలి బంతికే సాయి కిషోర్ ఫ్యాన్స్ రివర్స్ స్వీప్ ఆడి ఎల్బీడబ్ల్యూ రూపంలో వికెట్ సమర్పించుకున్నాడు. ఓవరాల్ గా 6 ఇన్నింగ్స్‌లలో కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్ లో 4 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ ఆడిన 10 మ్యాచ్ ల్లో 6 మ్యాచ్ ల్లో గెలిచి 13 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. మరో నాలుగు మ్యాచ్ లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ప్లే ఆఫ్స్ కు ముందు ఎవరికి ఛాన్స్ దక్కుతుందో అనే విషయం ఆసక్తికరంగా మారింది.