BAN vs IND: బంగ్లాదేశ్‌తో సిరీస్ రద్దు చేసుకోనున్న టీమిండియా.. కారణం ఇదే!

BAN vs IND: బంగ్లాదేశ్‌తో సిరీస్ రద్దు చేసుకోనున్న టీమిండియా.. కారణం ఇదే!

భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ గడ్డపై ఆడబోయే వన్డే, టీ20 సిరీస్ జరిగే సూచనలు కనిపించడం లేదు. షెడ్యూల్ ప్రకారం టీమిండియా ఆగస్టు నెలలో బంగ్లాదేశ్ తో మూడు వన్డేలతో పాటు మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఆగస్టు నెలలో జరగబోయే ఈ టూర్ కు భారత్ పర్యటించేది అనుమానంగా కనిపిస్తుంది. సరిహద్దుల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌వెళ్ళడానికి ఆసక్తి చూపించడం లేదట. ఇటీవలే బంగ్లాదేశ్ ఆర్మీ అధికారి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత భారత క్రికెట్ జట్టు రాబోయే బంగ్లాదేశ్ పర్యటన అనిశ్చితంగా మారింది.

ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. త్వరలోనే ఈ సిరీస్ పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం.పహల్గాం ఉగ్రదాడితో ఇటీవలే పాకిస్థాన్ తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్ లు ఆడేది లేదని బీసీసీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దుబాయ్‌ వేదికగా 2025 ఐసీసీ ఛాంపియన్స్ టైటిల్ గెలుచుకున్న తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి వన్డే సిరీస్ ఇదే. మొదట వన్డే సిరీస్ ఆగస్టు 17న ప్రారంభమవుతుంది. మీర్పూర్ వేదికగా ఆగస్ట్ 17, 20 న తొలి రెండు వన్డేలు జరుగుతాయి. చట్టోగ్రామ్ లో ఆగస్టు 23 న మూడో వన్డే జరగనుంది.

►ALSO READ | వైభవ్ సూర్యవంశీపై జెండర్ సెన్సిటివిటీ కామెంట్స్.. ఆ అమ్మాయిని అరెస్టు చేయాలని నెటిజన్ల డిమాండ్

ఈ సిరీస్ కు సీనియర్ ప్లేయర్లు అందుబాటులో ఉంటారా లేదా అనే విషయంలో సందిగ్దత నెలకొంది. కెప్టెన్ రోహిత్ శర్మ రెస్ట్ తీసుకోవాలని భావిస్తే యువ బ్యాటర్ శుభమాన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. సూర్యకుమార్ యాదవ్ సారధ్యంలో టీమిండియా ఆగస్టు 26న బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. 2026 లో భారత్ వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుండడంతో ఈ సిరీస్ కు భారత క్రికెట్ జట్టు పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ఆగస్ట్ 26 న చట్టోగ్రామ్ వేదికగా జరుగుతుంది. ఆగస్టు 29, ఆగస్టు 31 న వరుసగా రెండు, మూడు టీ20 మ్యాచ్ లు జరుగుతాయి. 

చివరిసారిగా టీమిండియా బంగ్లాదేశ్‌లో పర్యటించినప్పుడు.. 1-2 తేడాతో మన జట్టు సిరీస్ ను కోల్పోయారు. బంగ్లాదేశ్‌లో బంగ్లాదేశ్‌తో ఓవరాల్ గా 25 వన్డేలు ఆడితే.. ఆరు ఓడిపోయి, 18 గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది.