వైభవ్ సూర్యవంశీపై జెండర్ సెన్సిటివిటీ కామెంట్స్.. ఆ అమ్మాయిని అరెస్టు చేయాలని నెటిజన్ల డిమాండ్

వైభవ్ సూర్యవంశీపై జెండర్ సెన్సిటివిటీ కామెంట్స్.. ఆ అమ్మాయిని అరెస్టు చేయాలని నెటిజన్ల డిమాండ్

సోషల్ మీడియాలో కామెంట్స్ కు హద్దూ పద్దూ లేకుండా పోతోంది. ఎప్పుడు ఎలా ఫేమస్ అవుదామా అన్నట్లు వ్యవహరిస్తున్నారు కొందరు. అందులో ముఖ్యంగా అమ్మాయిలు ఇలా ప్రవర్తించడంపై సోషల్ మీడియాలో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్ చరిత్రలో అతిచిన్న వయసులో రికార్డు నెలకొల్పీ దేశం మొత్తాన్ని ఆకర్శించిన వైభవ్ పై ఒక అమ్మాయి చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ‘‘14 ఏళ్ల చిన్న పిల్లాడు.. ఇంకా మైనర్.. అతడిపై ఇంత దారుణంగా కామెంట్ చేస్తావా.. నువ్వు కటకటాలకు పోవాల్సిందే..’’నంటూ పోస్టులు పెడుతున్నారు.

బీహార్ కు చెందిన వైభవ్ సూర్యవన్షీ.. రాజస్థాన్ రాయల్స్ తరఫున 35 బాల్స్ లోనే సెంచరీ చేసి ఐపీఎల్ లో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన రెండో ప్లేయర్ గా.. అతితక్కువ వయసులో చేసిన తొలి బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు వైభవ్. అప్పటి నుంచి ఈ యంగ్ క్రికెటర్ ట్రెండింగ్ లోకి వచ్చాడు. క్రికెట్ దిగ్గజాలు సైతం అతడి ధైర్యానికి, ఆటతీరుకు ఫిదా అయ్యారు. భారత క్రికెట్ కు సచిన్ లాంటి మరో ఆణిముత్యం లభించినట్లు అభివర్ణించారు. అలాంటి వైభవ్ పై పరమ చిరాకు తెప్పించేలా.. సాటి మహిళలు ఛీదరించుకునేలా కామెంట్స్ చేయడం ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి దారితీసింది. 

వైభవ్ పై జెండర్ సెన్సిటివిటీ కామెంట్స్ చేసిన ఒక ట్వీట్ ను దీపికా నారాయణ్ భరద్వాజ్ అనే నెటిజన్ పోస్ట్ చేసింది. వైభవ్ పై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన సదరు అమ్మాయి ట్వీట్ కు చెంపచెళ్లుమనిపించేలా రిప్లై ఇస్తూ ట్వీట్ చేసింది. ‘‘ఒక మహిళ.. అందులో కంటెంట్ క్రియేటర్ కు మైనర్ అయిన చిన్నారి వైభవ్ లో షుగర్ డాడీ కనిపించాడు. జెండర్ సెన్సిటివిటీ కామెంట్స్ చేసినందుకు నేషనల్ క్రైమ్ బ్రాంచ్, పోలీసులు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కామెంట్స్ ఒక అమ్మాయిపై పురుషులు పెట్టి ఉంటే తప్పించుకునే ఆప్షన్ ఉండేది కాదు. కానీ నువు మహిళ అయినందుకు బతికిపోయావు’’ అంటూ రిప్లై ఇచ్చింది. 

ఈ ట్వీట్ పై వరుస కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. అమ్మాయి అయితే మాత్రం.. మైనర్ పై ఇంత ఘోరమైన భాష వాడినందుకు జైలు కు పంపాల్సిందే. పోక్సో చట్టం కింద అరెస్టు చేయాల్సిందేనని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

ఇది నేషనల్ స్కాండల్.. జెండర్స్ ను రివర్స్ చేస్తూ మాట్లాడటం క్షమించరాని నేరం.. అరెస్టు చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మహిళలు, పురుషులతో పోల్చినపుడు మహిళలు జెండర్ సెన్సిటివిటీ కామెంట్స్ చేసినపుడు సొసైటీ ప్రతిస్పందించే తీరు వేరుగా ఉందని.. ఎవరైనా ఒకటే శిక్ష అమలు పరచాలనే డిమాండ్లు వస్తున్నాయి. అదే 14 ఏళ్ల చిన్నారిపై పురుషులు కామెంట్స్ చేసి ఉంటు సోషల్ మీడియాలో పెద్ద దాడి మొదలయ్యేదని, అబ్బాయి విషయం కాబట్టి వేరేలా ఉందని ట్వీట్స్ చేస్తున్నారు. 

ఈ ట్వీట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ తో సోషల్ మీడియాలో మాటల యుద్ధమే నడుస్తోంది. సైబర్ క్రైమ్ యూనిట్స్, చైల్డ్ ప్రొటెక్టింగ్ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఈ ఇష్యూపై స్పందించాలని డిమాండ్లు వస్తున్నాయి. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.