IND vs ENG: నన్ను సెలక్ట్ చేయండి.. ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్ గెలిపిస్తా: టీమిండియా వెటరన్ బ్యాటర్

IND vs ENG: నన్ను సెలక్ట్ చేయండి.. ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్ గెలిపిస్తా: టీమిండియా వెటరన్ బ్యాటర్

ఇంగ్లాండ్ తో జరగబోయే ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్ కు భారత క్రికెట్ జట్టులో స్థానం కోసం టీమిండియా వెటరన్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా పోరాడుతున్నాడు. 2023 దక్షిణాఫ్రికా టూర్‌ లో భాగంగా టెస్టు జట్టు నుంచి ఈ సీనియర్ ప్లేయర్ ను సెలక్టర్లు తప్పించిన సంగతి తెలిసిందే. 2020 నుండి పుజారా ఫామ్ దిగజారుతూ వస్తుంది. గత నాలుగేళ్లలో పుజారా భారత్ తరపున 28 టెస్టు మ్యాచ్ లాడితే యావరేజ్ 30 కంటే తక్కువగానే ఉంది. కేవలం ఒకసారి మాత్రమే మూడంకెల స్కోర్ ను చేరుకోగలిగాడు. నిలకడగా రాణించలేకపోవడం పుజారాకు మైనస్ గా మారింది. తాజాగా తనను సెలక్ట్ చేయాల్సిందిగా పుజారా సెలక్టర్లకు సెలక్టర్లకు సంకేతాలు పంపిస్తున్నాడు.

పుజారా మాట్లాడుతూ.. " భారత జట్టులో పోటీ చాలా కఠినంగా ఉంటుంది. 100 టెస్టులాడినా నన్ను పట్టించుకోకపోవడం నిరాశకు గురి చేస్తుంది. అట పట్ల నాకున్న ప్రేమ నన్ను ఇంకా భారత జట్టుకు ఆడాలని ప్రేరేపిస్తుంది. దాదాపు 20 సంవత్సరాలుగా ఇంగ్లాండ్‌లో భారత జట్టు సిరీస్ గెలవలేదు. నాకు అవకాశం వస్తే నా నుండి అత్యుత్తమంగా రాణించి జట్టుకు ట్రోఫీ అందించే ప్రయత్నం చేస్తాను. నేను ప్రస్తుతం మంచి ఫామ్ లోనే ఉన్నాను. డొమెస్టిక్, అంతర్జాతీయ లీగ్ ల్లో రాణిస్తున్నాను". అని పుజారా  రెవ్‌స్పోర్ట్జ్‌తో మాట్లాడుతూ అన్నారు. 
 
ఇంగ్లాండ్ తో జూన్ 20 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ అయిపోయిన వెంటనే వారం రోజుల గ్యాప్ లో భారత జట్టు ఇంగ్లాండ్ కు పయనమవనుంది. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ వేదికగా 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడాల్సి ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ 2025-27 సైకిల్ లో టీమిండియాకు ఇదే తొలి సిరీస్. ఈ సిరీస్ కు భారత జట్టును మే రెండో వారంలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ సారి ఇండియా ఎక్కువగా యంగ్ ప్లేయర్లతోనే బరిలోకి దిగబోతుంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ లయన్స్ తో యంగ్ ఇండియా రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల సిరీస్ ఆడుతుంది.

►ALSO READ | IPL 2025: మరో ఆస్ట్రేలియన్ క్రికెటర్‌పై పాంటింగ్ గురి.. మ్యాక్స్ వెల్ స్థానంలో స్టార్ బ్యాటర్ కు ఛాన్స్

హెడ్డింగ్లేలో జూన్ 20 న తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లోని మిగతా నాలుగు టెస్టులకు ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్ ఓవల్ వేదికలు కానున్నాయి. 2021-22 చివరిసారిగా భారత్ ఇంగ్లాండ్ లో పర్యటించింది. ఈ సిరీస్ 2-2 తో సమంగా ముగిసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్, భారత్ చివరిసారిగా టెస్ట్ సిరీస్ ఆడాయి. భారత్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్ ఉత్కంఠభరితంగా సాగుతుందని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిచర్డ్ గౌల్డ్ ఆశిస్తున్నాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricShadow (@cricshadow)