RRB ఉద్యోగాలకు మరీ ఇంత పోటీనా..? తిప్పి కొడితే 32 వేల గ్రూప్-డీ పోస్టులు.. ఎంత మంది అప్లై చేశారో తెలుసా..?

RRB ఉద్యోగాలకు మరీ ఇంత పోటీనా..? తిప్పి కొడితే 32 వేల గ్రూప్-డీ పోస్టులు.. ఎంత మంది అప్లై చేశారో తెలుసా..?

మన దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెరిగిపోతోంది. లక్షల్లో ఉద్యోగాలు.. కోట్లల్లో నిరుద్యోగులు అనేంత దారుణంగా పరిస్థితి తయారైంది. ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థుల సంఖ్యనే ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. తాజాగా.. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్.. అదేనండీ ఆర్ఆర్బీ.. రైల్వేలో గ్రూప్-డీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

RRB ఉద్యోగాలకు కాంపిటీషన్ ఉంటుందని తెలుసు గానీ మరీ ఈ స్థాయిలో ఉండటం మాత్రం సాధారణ విషయం కాదు. దేశవ్యాప్తంగా రైల్వేలో గ్రూప్-డీ ఉద్యోగాల కోసం కోటీ 8 లక్షల మంది అప్లై చేసుకున్నారు. 32 వేల 438 రైల్వే గ్రూప్-డీ పోస్టులకు గానూ ఆర్ఆర్బీకి అందిన దరఖాస్తుల సంఖ్య కోటి పైనే ఉందంటే నిరుద్యోగం ఏ స్థాయిలో పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

తెలుగు రాష్ట్రాల నుంచి కూడా రైల్వే గ్రూప్-డీ పోస్టులకు భారీగానే అప్లై చేశారు. సికింద్రాబాద్ ఆర్ఆర్బీకి 9 లక్షల 60 వేల 697 దరఖాస్తులు అందాయి. ముంబై ఆర్ఆర్బీకి దేశంలోనే అత్యధికంగా 15 లక్షల 59 వేల 100 అప్లికేషన్లు అందడం గమనార్హం. బెంగళూరు ఆర్ఆర్బీకి 2 లక్షల 75 వేల 307 దరఖాస్తులు అందాయి.

ఇలా.. మొత్తంగా దేశంలోని ఆర్ఆర్బీ రీజినల్ కార్యాలయాలకు రైల్వే గ్రూప్-డీ పోస్టులకు కోటీ 8 లక్షల 22వేల 423 అప్లికేషన్లు వచ్చాయి. తిప్పి కొడితే 35 వేలు కూడా లేని పోస్టులకు కోటి మంది అప్లై చేశారంటే మన దేశంలో నిరుద్యోగం విలయ తాండవం చేస్తుందనడానికి ఇంతకు మించిన నిదర్శనం అక్కర్లేదేమో.