
దేశ భక్తి అంటే ఇది కదా.. దేశంపై ప్రేమ అంటే ఇది కదా.. దేశాభిమానం అంటే ఇది.. దేశం దేశ ప్రజల కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేస్తానంటున్నాడు చూడండీ.. ఇతని దేశభక్తి హ్యాట్సాప్ బాస్.. ఇదేదో గల్లీ బాయ్ డైలాగ్ కాదు.. ఓ రాష్ట్ర మంత్రి మాటలు.. ప్రధాని మోదీ అనుమతిస్తే.. ప్రధాని మోదీ చిటికేసి చెబితే చాలంట.. సూసైడ్ బాంబర్ గా మారి.. ఆత్మాహుతి దళంగా మారి.. పాకిస్తాన్ దేశాన్ని లేపేస్తా అంటున్నారు కర్నాటక రాష్ట్ర మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండియా - పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దెబ్బకు దెబ్బ తీయాలనే కసితో ఒకవైపు భారత్ భద్రతా దళాలను సంసిద్ధం చేస్తున్న వేళ.. ఆత్మరక్షణ కోసం పాకిస్తాన్ కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ పోటీగా డ్రిల్స్ నిర్వహిస్తోంది. ఇరు దేశాలు యుద్ధానికి దిగేలా ఉన్నాయని అమెరికా వంటి అగ్రదేశాలు సైతం సంయమనం పాటించాలని సూచిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో కర్ణాటక మంత్రి చేసిన వ్యా్ఖ్యలు సంచలనంగా మారాయి. ఇరు దేశాల మధ్య భద్రతా దళాలు డ్రిల్స్ చేస్తున్న తరుణంలో సాధారణ పౌరుడు కాదు.. ఏకంగా ఒక రాష్ట్రానికి మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
శుక్రవారం (మే 2) కర్ణాటక హౌజింగ్, మైనారిటీ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ప్రధాని మోదీ, అమిత్ షా అనుమతిస్తే పాకిస్తాన్ పై సూసైడ్ బాండుతో దాడి చేస్తానని అనటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
‘‘పాకిస్తాన్ భారత్ కు ఎప్పుడూ శత్రువే. ప్రధాని మోదీ, అమిత్ షా పర్మిషన్ ఇస్తే సూసైడ్ బాంబర్ గా మారిపోయి పాకిస్తాన్ ను లేపేస్తా. దేశం కోసం ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఈ విషయంలో నేను జోక్ చేయడం లేదు. చాలా సీరియస్ గా ఈ వ్యాఖ్యలు చేస్తున్నా’’నని కామెంట్ చేశాడు. పహల్గాం దాడి చాలా దారుణమైనదని, అమాయక ప్రజలను పొట్టనపెట్టుకున్న పాక్ కు వ్యతిరేకంగా.. టెర్రరిజాన్ని అంతం చేసేందుకు అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అన్నారు.
ఇండియా పాకిస్తాన్ యుద్ధం పై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభిప్రాయానికి పూర్తి భిన్నంగా మంత్రి మాట్లాడటం చర్చనీయాంశం అయ్యింది. యుద్ధం పరిష్కారం కాదని, దీని వలన ఇరు దేశాలలో దీర్ఘకాలిన నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వస్తుందని సీఎం ఇప్పటికే పలు సందర్భాల్లో అన్నారు. కానీ అందుకు భిన్నంగా.. పాకిస్తాన్ పై మావన బాంబునై దాడి చేయడానికి సిద్ధమని చెప్పడంతో ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.