OTT Bold: ఆహా ఓటీటీకి తెలుగు బోల్డ్ మూవీ.. వయసు మీద పడిన మగాళ్లపై మనసు పారేసుకునే బ్యూటీ

OTT Bold: ఆహా ఓటీటీకి తెలుగు బోల్డ్ మూవీ.. వయసు మీద పడిన మగాళ్లపై మనసు పారేసుకునే బ్యూటీ

దర్శకుడు మారుతి షో రన్నర్‌‌‌‌గా మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై SKN నిర్మించిన ‘త్రీ రోజెస్’సీజన్ 2 త్వరలో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. కిరణ్ కె కరవల్ల దీనికి దర్శకుడు. ఈ సిరీస్లో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా తెలుగమ్మాయి కుషిత కల్లపు నటించింది.

3 రోజెస్ రెండో సీజన్లో కొత్త రోజ్ వచ్చిందంటూ మంగళవారం (ఏప్రిల్ 29) ఆహా ఓటీటీ ఓ చిన్న గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడు 39 సెకన్ల నిడివి ఉన్న తన క్యారెక్టర్‌‌‌‌ గ్లింప్స్‌‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాత్ర మరింత బోల్డ్గా ఉండబోతున్నట్లు ఈ వీడియో చూస్తే తెలుస్తోంది.

“కొత్త రోజ్‌ను కలవండి. ఖుషితా కల్లాపు. ఈమె వయసు మీద పడిన మగాళ్లను ప్రేమిస్తుంది. ఈమె జీవితం గందరగోళం. ఈమే మీ స్పిరిట్ యానిమల్ కావచ్చు” అనే క్యాప్షన్తో ఆహ తెలిపింది. 

ఈ క్రమంలో, తెలుగు అమ్మాయిలకు అవకాశాలు తగ్గిపోతున్న తరుణంలో ఈ చిత్రం ద్వారా నిర్మాత SKN తనకు పెద్ద అవకాశం ఇచ్చారని కుషిత థ్యాంక్స్ చెప్పింది. ఈ సిరీస్‌‌తో తనకు కావాల్సినంత గుర్తింపు లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. కుషిత గతంలో నీతోనే నేను (2023) మరియు చాంగురే బంగారు రాజా (2023) వంటి సినిమాల్లో నటించింది.

ఈ బోల్డ్ కామెడీ వెబ్ సిరీస్లో ఈషా రెబ్బా, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రలు పోషించారు. అన్నీ కుదిరితే, 3 రోజెస్ రెండో సీజన్ మే సెకండ్ వీక్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. త్వరలో ఈ విషయంపై క్లారిటీ రానుంది. 

ఇకపోతే, 3 రోజెస్ సిరీస్ను మ్యాగీ డైరెక్ట్ చేయగా.. రవి నంబూరి కథ అందించారు. నవంబర్, 2021లో తొలి సీజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓటీటీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది.