
ఇటీవలే విజయ్ దేవరకొండపై SR నగర్ పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. సూర్య నటించిన రెట్రో సినిమా ఈవెంట్లో విజయదేవరకొండ ఆదివాసీలను ఉద్దేశించి మాట్లాడిన మాటలపై తీవ్ర వ్యతిరేఖత వచ్చింది.
ట్రైబల్స్ అనే పదం వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజన సంఘాలు.. ఉగ్రవాదుల దాడులను గిరిజనులతో పోల్చడాన్ని తీవ్రంగా తప్పుబట్టడంతో.. ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని.. గిరిజనులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తన మాటలకూ క్లారిటీ ఇస్తూ నోట్ రిలీజ్ చేశాడు. ‘‘నేను మాట్లాడిన మాటలు కొంతమంది ప్రజలలో ఆందోళన కలిగించిందని నా దృష్టికి వచ్చింది. అది ఈ నోట్ ద్వారా స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఏ సమాజాన్ని, ముఖ్యంగా మన షెడ్యూల్డ్ తెగలను బాధపెట్టడం లేదా లక్ష్యంగా చేసుకోవడం అనే ఉద్దేశ్యం నాకు లేదు. వారిని నేను ఎంతో గౌరవిస్తాను. వారు మన దేశంలో అంతర్భాగంగా భావిస్తాను.
మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి. ఐక్యంగా నిలబడాలి. నేను ఏ సమూహంపై ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ వివక్ష చూపలేదు. నేను ఉపయోగించిన "తెగ" అనే పదం, వందల ఏళ్ల కిందట సమాజం, ప్రజలు గుంపులుగా వ్యవస్థీకృతమై ఉండేవాళ్లని నా ఉద్దేశం. వారందరూ నా కుటుంబ సభ్యులు, నా సోదరులే అని అనుకుంటాను.
నేను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నాను. శాంతి, పురోగతి మరియు ఐక్యత గురించి మాట్లాడటమే నా ఏకైక లక్ష్యమని’’నోట్ ద్వారా విజయ్ వివరణ ఇచ్చారు. మరి విజయ్ ఇచ్చిన ఈ వివరణతో సమస్య సద్దుమణుగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
To my dear brothers ❤️ pic.twitter.com/QBGQGOjJBL
— Vijay Deverakonda (@TheDeverakonda) May 3, 2025
అసలు విజయ్ ఏమన్నాడంటే..?
హీరో సూర్య నటించిన తాజా చిత్రం రెట్రో. ఇటీవల హైదరాబాద్‌లో ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా హాజరైన విజయ్ పహల్గాం టెర్రర్ ఎటాక్‌పై స్పందించాడు. ఈ క్రమంలోనే గిరిజనులపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘టెర్రరిస్ట్ కొడుకులకు కూడా సరైన విద్య చిన్నప్పటి నుంచి ఇప్పించలేదు కాబట్టే ఇలా బ్రెయిన్ వాష్ అవ్వకుండా ఉన్నారు. 500 ఏళ్ల క్రితం గిరిజనులు (ట్రైబల్స్) ఘర్షణ పడినట్లుగా కశ్మీర్‌లో దాడులు, విధ్వంసం సృష్టిస్తూ ఇప్పటికీ అలా కామన్ సెన్స్ లేకుండా, బుద్ధి లేకుండా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు’’ అని కామెంట్స్ చేశాడు.