
ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఐటీ ఉద్యోగుల్లో కాలేయ సంబంధ సమస్యలు రోజురోజుకు అధికమవుతున్నాయి. నూటికి 80 శాతం మందికిపైగా టెకీలు కాలేయ సంబంధ సమస్యలు, ఉబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యలతో బాధపడుతున్నారని ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల ఈ సమస్య అధికంగా ఉందని తాజా సర్వేలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా పార్లమెంటులో స్వయంగా ప్రకటించారు. వివరాల్లోకి వెళితే..
ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం..హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా కాలేయ సంబంధిత సమస్యలు అధికంగా ఉన్నాయని తేలింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పి.నడ్డా పార్లమెంటులో ప్రకటించారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ వివరాలను వెల్లడించారు.
2025లో 'నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్' జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం..హైదరాబాద్‌లోని 345 మంది ఐటీ ఉద్యోగులను సర్వే చేయగా, వారిలో 84.06% మందికి కాలేయంలో కొవ్వు పేరుకుపోయినట్లు (Fatty Liver) గుర్తించారు. ఇది మెటబాలిక్ సిండ్రోమ్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (MAFLD) అనే వ్యాధికి ప్రధాన సూచిక.
తాజా సర్వే ఏం చెబుతుందంటే..
2025లో 'నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్' జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, హైదరాబాద్‌లోని 345 మంది ఐటీ ఉద్యోగులను సర్వే చేయగా, వారిలో 84.06% మందికి కాలేయంలో కొవ్వు పేరుకుపోయినట్లు (Fatty Liver) గుర్తించారు. ఇది మెటబాలిక్ సిండ్రోమ్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (MAFLD) అనే వ్యాధికి ప్రధాన సూచిక.
ఈ అధ్యయనంలో ఇంకా గుర్తించిన ఇతర ఆరోగ్య సమస్యలు:
ఊబకాయం (Obesity): సర్వేలో పాల్గొన్న ఉద్యోగులలో 71% మంది ఊబకాయంతో బాధపడుతున్నారు.
మెటబాలిక్ సిండ్రోమ్ : అధిక శాతం ఐటీ ఉద్యోగులకు ఈ సిండ్రోమ్ ఉన్నట్లు తేలింది. దీనివల్ల డయాబెటిస్ ,గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.
Also Read : పంచ ఆరోగ్య సంస్థ ఏమంటుందంటే..
ఈ సమస్యలకు కారణాలు
నిపుణుల అభిప్రాయం ప్రకారం..ఐటీ ఉద్యోగుల జీవనశైలి ఈ ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఒకే చోట కూర్చుని పనిచేయడం, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ పని గంటలు: శారీరక, మానసిక ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, సమయానికి భోజనం చేయకపోవడం, ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడంవంటివి ఈ సమస్యలకు కారణంగా చెబుతున్నాయి. నిద్రలేమి కూడా ప్రధాన కారణంగా సర్వేలు చెబుతున్నాయి. ఒత్తిడి,ఎక్కువ పని గంటల వల్ల సరిపడా నిద్ర లేకపోవడం తలెత్తుతుందని తేలింది.
ప్రభుత్వం చేపట్టిన చర్యలు
కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా ఐటీ ఉద్యోగులలో పెరుగుతున్న కాలేయ సమస్యను మహమ్మారిగా అభివర్ణించారు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని చెప్పారు. కేంద్ర నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) నివారణకు జాతీయ కార్యక్రమం కింద ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ఐటీ కంపెనీల్లో అవగాహన కార్యక్రమాలు,యోగా విరామం వంటి ప్రోటోకాల్స్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని నడ్డా చెబుతున్నారు.
ఈ అధ్యయనం ఐటీ ఉద్యోగుల ఆరోగ్య సమస్యల గురించి హైలైట్ చేసింది. ఇది ప్రజలలో ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే వారిలో ఆరోగ్యపరమైన జాగ్రత్తలపై అవగాహన అవసరాన్ని స్పష్టం చేస్తుంది.