
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ,ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) హెపటైటిస్ D వైరస్ (HDV) ను మానవులలో క్యాన్సర్ కారకంగా (carcinogenic to humans) గుర్తించారు. హెపటైటిస్ B ,C లతో పాటు HDV ఇప్పుడు క్యాన్సర్ కారక కారకాల జాబితాలో చేర్చింది. ఇది హెపటైటిస్ D తీవ్రత కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని వెల్లడించింది.
హెపటైటిస్ D అంటే..
హెపటైటిస్ D, డెల్టా హెపటైటిస్ అని కూడా పిలుస్తారు.ఇది కాలేయ సంక్రమించే వైరస్. ఈ వైరస్ HDV కారణంగా సోకుతుంది. అయితే HDV వైరస్ స్వయంగా సంక్రమించదు. ఇది అంటే హెపటైటిస్ B ఉన్న వ్యక్తికి మాత్రమే హెపటైటిస్ D సోకగలదు. ఇది సహ-సంక్రమణ (co-infection) లేదా సూపర్ ఇన్ఫెక్షన్ (superinfection) గా జరుగవచ్చు.
క్యాన్సర్ ముప్పుగా ఎందుకు ప్రకటించారు?
IARC హెపటైటిస్ Dని క్యాన్సర్ కారకంగా ప్రకటించడానికి ప్రధాన కారణాలు ఇవే. హెపటైటిస్ B ఇన్ఫెక్షన్ మాత్రమే ఉన్నవారితో పోలిస్తే, HDV ఉన్నవారికి కాలేయ క్యాన్సర్ (హెపటోసెల్యులర్ కార్సినోమా) వచ్చే ప్రమాదం 2 నుంచి 6 రెట్లు అధికంగా ఉంటుందని WHO ప్రకటించింది.
HDV-,HBV సహ-సంక్రమణ దీర్ఘకాలిక వైరల్ హెపటైటిస్‌లో అత్యంత తీవ్రమైన దశ. ఇది వేగంగా కాలేయ సిర్రోసిస్ ,కాలేయ సంబంధిత మరణాలకు దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 48 మిలియన్ల మంది HDV బారిన పడ్డారని WHO అంచనా. అన్ని హెపటైటిస్ సంక్రమణలలో ఇది అత్యధిక మరణాల రేటును (20శాతం) కలిగి ఉంది.చాలా మందికి హెపటైటిస్ D గురించి అవగాహన లేదు.దీనివల్ల స్క్రీనింగ్ ,చికిత్స ఆలస్యం అవుతుంది.
►ALSO READ | జ్యోతిష్యం : ఆగస్ట్ నెలలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది..
HDVని క్యాన్సర్ కారకంగా వర్గీకరించడం ద్వారా WHO ,IARC అనేక లక్ష్యాలను సాధించే ప్రయత్నాలు చేస్తోంది.హెపటైటిస్ D తీవ్రత ,కాలేయ క్యాన్సర్ ప్రమాదం గురించి ప్రజలలో, ఆరోగ్య సంరక్షణ నిపుణులలో అవగాహన పెంచడం కార్యక్రమాలు నిర్వహిస్తోంది. హెపటైటిస్ B ఉన్న వ్యక్తులలో HDV కోసం స్క్రీనింగ్‌ను మెరుగుపరచడం, తద్వారా ముందస్తు గుర్తింపు,చికిత్స సాధ్యమవుతుంది.
హెపటైటిస్ D ఎలా వ్యాపిస్తుంది?
హెపటైటిస్ D కూడా హెపటైటిస్ B వలె రక్త మార్పిడి, కలుషితమైన ఇంజక్షన్లు, లైంగిక సంబంధం ద్వారా, తల్లి నుంచి బిడ్డకు ప్రసవం సమయంలో సంక్రమించవచ్చు.
నివారణ ,చికిత్స
హెపటైటిస్ B వ్యాక్సిన్ హెపటైటిస్ Dని నిరోధించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం.ఎందుకంటే హెపటైటిస్ B లేని వారికి HDV సోకదు.హెపటైటిస్ B ఉన్నవారు రెగ్యులర్ స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా HDVని ముందే గుర్తించవచ్చు.
HDV సంక్రమణకు ఇటీవల కొన్ని కొత్త చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి.ఇవి కాలేయ నష్టాన్ని తగ్గించి క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడతాయి.
హెపటైటిస్ Dని క్యాన్సర్ కారకంగా ప్రకటించడం అనేది ఈ వైరస్ వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య సమస్యలపై అవగాహనకు ఒక ముఖ్యమైన అడుగు. ఇది హెపటైటిస్ D నివారణ, ముందస్తు గుర్తింపు,చికిత్స కోసం మరింత సమగ్రమైన విధానాలను ప్రోత్సహిస్తుంది.