జ్యోతిష్యం : ఆగస్ట్ నెలలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది.. శక్తివంతమైన శని, శుక్ర గ్రహాల మార్పు ప్రభావం ఎలా ఉండబోతుంది..?

జ్యోతిష్యం : ఆగస్ట్ నెలలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది.. శక్తివంతమైన శని, శుక్ర గ్రహాల మార్పు ప్రభావం ఎలా ఉండబోతుంది..?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం...  ప్రతి నెలా గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది.  ఆగస్టు నెలలో   కొన్ని ప్రధాన గ్రహాలు మార్పు చెందుతున్నాయి.  పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెలలో శని.. శుక్ర గ్రహాల  సంచారంలో మార్పుతో   ఏరాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు  తెలుసుకుందాం. . .

మేష రాశి : ఈ నెలలో ( ఆగస్టు 2025) ఈ రాశి వారికి కేరీర్​ విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడుతాయి. ఆర్థికవిషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. రెండో వారం గడచిన తరువాత కొన్ని సానుకూల మార్పులు జరుగుతాయి.వృత్తి పరంగా.. వ్యాపార పరంగా కొన్ని ఆటంకాలు కలుగుతాయి.  అనవసర విషయాల జోలికి వెళ్లవద్దని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ప్రతి విషయంలో కూడా ఓర్పు.. సహనం పాటించండి.  ఆరోగ్య వి షయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

వృషభ రాశి :  ఈరాశి వారికి ఈ నెలలో   ఆర్థికంగా స్థిరత్వం లభించే అవకాశం ఉంది.  ఆత్మగౌరవం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. కెరీర్​ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  లాభ స్థానంలో శనీశ్వరుడు కొనసాగుతున్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కూడా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. . అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. రియల్ ఎస్టేట్ వారికి లాభాలు వృద్ధి చెందుతాయి. 

మిథున రాశి:  ఈ రాశి వారికి ఈ నెలలో పెండింగులో ఉన్న బకాయిలన్నీ లభిస్తాయి. స్నేహితులు, ప్రియమైన వారితో  యాత్రకు వెళ్లే అవకాశం ఉంది.. మీరు చేసే ప్రతి పనిలో మంచి విజయం సాధిస్తారు.ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది.  ఆస్తి వివాదాల్లో రాజీ మార్గాలను అనుసరిస్తారు. పలుకుబడి బాగా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. 

కర్కాటక రాశి :  ఈ రాశి వారికి ఆగస్టు నెలలో మంచి ఫలితాలుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  వీరి కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది. కర్కాటక రాశి వారికి బంధువులతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. ఎంతోకాలంగా ఉన్న రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తారు. ముఖ్య మైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. తలపెట్టిన ప్రతి పని నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల సహకారంతో బాధ్యతలను పూర్తి చేస్తారు.

సింహ రాశి : ఈ రాశి వారికి ఈ నెల రెండో వారం తరువాత సంపద పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.  అయినా ఖర్చులు పెరుగుతాయి.  ఎవరికి అప్పులు ఇవ్వవద్దు. ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఉద్యోగస్తులకు సానుకూల ఫలితాలుంటాయి.  వ్యాపారస్తులకు.. చేతి వృత్తుల వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. 

కన్యా రాశి : ఈ  వారికి ఆగస్టులో గ్రహాల కదలికలో మార్పు కారణంగా ఆర్థిక పరిస్థితి బలపడటమే కాకుండా..  ప్రతి పనిలో కూడాయ  మంచి విజయం సాధిస్తారు. కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధుమిత్రులతో విందులో పాల్గొంటారు. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది. నిరుద్యోగులు శుభ వార్తలు వింటారు. సప్తమంలో ఉన్నసమాజంలో గౌరవం పెరుగుతుంది.ఈ మాసంలో మొహమాటం వల్ల మీ విశ్వాసం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.  

తుల రాశి : ఈ రాశి వారికి ఆగస్టు నెలలో  ఆదాయం పెరిగే అవకాశం ఉంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారులకు ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. మీరు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు.ముఖ్యంగా డబ్బు రాబడి పెరుగుతుంది. జీవిత భాగ స్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది ప్రేమ సంబంధాలు మెరుగవుతాయి. వ్యాపారవేత్తలకు ఈ కాలం ఆశాజనకంగా ఉంటుంది. పెద్ద మొత్తంలో ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది ప్రయత్నంతో అధిక లాభాలు పొందుతారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. 

వృశ్చిక రాశి:  ఈ  రాశివారికి ఈ  నెలలో కొన్ని గందరగోళ పరిస్థితులు ఏర్పడుతాయి.  పెద్దల నిర్ణయం ప్రకారం నడుచుకోండి.  ప్రతి విషయంలో అశాంతి ఏర్పడుతుంది.  ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.  ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి.  నెల మధ్యలో కెరీర్​ విషయంలో కొంత మార్పు వస్తుంది. ఖర్చులను తగ్గించుకోవాలి. ఆస్తి వివాదాల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోంది.  ఉన్నత స్థాయి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.  నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి.

ధనుస్సు రాశి: ఈ  రాశి వారికి కొంత ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు కలగడం, సమాజంలో గౌరవ, ప్రతిష్టలు తగ్గడం, ఆధ్యాత్మిక నమ్మకాల్లో తడబాటు కలుగుతుంది.  ఆర్యోగపరంగా జాగ్రత్తగా ఉండటం, అనవసర విషయాల జోలికి వెళ్లకుండా ఉండటం, మాట విషయం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదని పండితులు చెబుతున్నారు.  ఉద్యోగస్తులు అనవసరంగా మాట పడే అవకాశం ఉంది.  వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని పండితులుసూచిస్తున్నారు. 

మకర రాశి :   ఈ రాశి వారు అందరితో మర్యాదగా, సంయమనంతో వ్యవహరించాలని పండితులు చెబుతున్నారు. ఆగస్టు నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశివారు ధైర్యంగా ముందుకు సాగుతారు. వాహన యోగం ఉంది. స్నేహితుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత అప్రమ త్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రయాణాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. బంధుమిత్రులతో బంధాలు బలపడతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగులు పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. విద్యార్థులకు ..నిరుద్యోగులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. 

కుంభ రాశి:   ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ఆగస్టు నెలలో  అన్ని రకాల వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది.  కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటాయి. స్నేహితులతో సరదాగా గడుపుతారు .. సొంత ఇంటి ప్రయత్నాలు చాలావరకు సానుకూలపడతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం రాజీ మార్గంలో పరిష్కారం అవుతుంది.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది.  మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. 

మీన రాశి :  ఈ రాశి వారికి  ఆగస్టు నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా బాగుంటుంది, కానీ భావోద్వేగ సంబంధాలలో సమస్యలు రావచ్చు. కమ్యూనికేషన్ లో కూడా అడ్డంకులు  ఏర్పడే అవకాశం ఉంది.  ప్రతి విషయం పట్ల ఓర్పు సహనం పాటించండి.ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. వ్యాపారాలు అభివృద్ది చెందుతాయి. ఇతరులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరికీ ఎలాంటి హామీలు ఉండవద్దని పండితులు చెబుతున్నారు.