న్యూఢిల్లీ: పేదవర్గాలకు చెందిన 87 వేల మందికి పైగా యువతకు డిజిటల్ నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడానికి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) ఫౌండేషన్, ఐబీఎంతో కలిసి పనిచేయనుంది. ఈ శిక్షణ ఐబీఎం స్కిల్స్ బిల్డ్ కార్యక్రమం ద్వారా జరుగుతుంది. మార్కెట్‌కు సంబంధించిన డిజిటల్, డొమైన్, ఉపాధి శిక్షణను అందించి డిజిటల్ అంతరాన్ని తగ్గిస్తారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్‌కు సంబంధించిన కోర్సులు నేర్పిస్తారు.
