మెదక్లో అర్థరాత్రి కారులో 88 లక్షలు స్వాధీనం

మెదక్లో అర్థరాత్రి కారులో 88 లక్షలు స్వాధీనం

మెదక్ జిల్లాలో అర్థరాత్రి భారీగా నగదు పట్టుబడింది.  మాసాయిపేట మండలం పోతిన్ పల్లి చౌరస్తా దగ్గర అర్ధరాత్రి పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా నగదును పట్టుకున్నారు. పెద్ద శివునూరు గ్రామ శివారులోని ఒక గెస్ట్ హౌస్ నుంచి వచ్చిన కారును తనిఖీ చేయగా అందులో 88 లక్షల 43 వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మెదక్ బీఆర్ఎస్  ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి చెందిన డబ్బుగా గుర్తించారు పోలీసులు. 

పలు  గ్రామాలలో పోలింగ్ బూతుల వారిగా పంపిణీకి సిద్ధం చేసిన 27 ప్యాకెట్లలో మొత్తం 88 లక్షల 43 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు పోలిసులు తెలిపారు.  ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.  బీఆర్ఎస్ నేతలు అన్నం రవి, పుల్లబోయిన రవి అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.