మ‌హారాష్ట్ర‌లో 4 వేల మంది పోలీసుల‌కు క‌రోనా

మ‌హారాష్ట్ర‌లో 4 వేల మంది పోలీసుల‌కు క‌రోనా

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా వైర‌స్ విప‌రీతంగా విజృంభిస్తోంది. రోజు రోజుకీ భారీగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డిలో ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌గా ఉన్న పోలీసుల్లోనూ ప్ర‌తి రోజూ పాజిటివ్ కేసులు వ‌స్తూనే ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 88 మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని, ఒక పోలీస్ చికిత్స పొందుతూ మ‌ర‌ణించార‌ని మ‌హారాష్ట్ర పోలీసు శాఖ‌ వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం 4,048 మంది పోలీసులు క‌రోనా బారిన‌ప‌డ్డార‌ని తెలిపింది. చికిత్స త‌ర్వాత 3 వేల మంది డిశ్చార్జ్ కాగా.. 47 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. ప్ర‌స్తుతం 1001 మంది పోలీసులు వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని వెల్ల‌డించింది. కాగా, దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 4 ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోదు కాగా.. అందులో ల‌క్షా 28 వేల పాజిటివ్ కేసులు ఒక్క మ‌హారాష్ట్ర‌లోనే వ‌చ్చాయి. ఈ రాష్ట్రంలో ఇప్ప‌టికే క‌రోనా నుంచి కోలుకుని 64 వేల మందికి పైగా డిశ్చార్జ్ అయ్యారు.