బీసీ గురుకుల ఇంటర్​లో చేరిన 8910 మంది స్టూడెంట్లు

బీసీ గురుకుల ఇంటర్​లో చేరిన 8910 మంది స్టూడెంట్లు
  •  త్వరలో రెండో విడత అడ్మిషన్ నోటిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: బీసీ గురుకుల ఇంటర్ కాలేజీల్లో గురువారం వరకు మొత్తం 8910 మంది స్టూడెంట్స్ చేరినట్టు సెక్రటరీ సైదులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ గ్రూపుల్లో మొత్తం18,749 సీట్లు ఉన్నాయి. ఎంట్రన్స్ పరీక్ష లో వచ్చిన మార్కుల ఆధారంగా వారి జిల్లాలోని కాలేజీల్లో సీట్లను అధికారులు కేటాయించారు.

మొదటి విడతలో భాగంగా ఈ నెల 20 నుంచి గురువారం వరకు రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు. త్వరలో రెండో నోటిఫికేషన్ విడుదల చేస్తామని, తర్వాత మిగిలిన సీట్ల కు ఆన్ లైన్ లో స్పాట్ అడ్మిషన్ల ద్వారా సీట్లు భర్తీ చేస్తామని సెక్రటరీ సైదులు పేర్కొన్నారు.