గుర్రంపై స్కూల్ కు వెళతాడు.. విలేజ్ లో ధీరుడు

గుర్రంపై స్కూల్ కు వెళతాడు.. విలేజ్ లో ధీరుడు

విద్యార్థులు సాధారణంగా రిక్షా, వ్యాన్, బస్సు, సైకిల్‌పై స్కూల్‌కి వెళ్లడం మనం చూశాం. అయితే గుజరాత్‌లోని సూరత్ జిల్లా బార్డోలి తాలూకాకు చెందిన ఓ ప్రాథమిక పాఠశాల విద్యార్థి రోజూ గుర్రంపై పాఠశాలకు వస్తున్నాడు. విద్యార్థి పేరు కుష్ మహేశ్‌భాయ్ రాథోడ్. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థి వయస్సు 13 ఏళ్లు. విద్యార్థి కుటుంబం వ్యవసాయం చేసుకుంటోంది. కుష్ దాదాపు ఐదు సంవత్సరాల వయస్సులో గుర్రంపై ఎక్కి స్కూల్‌కి వెళ్లటం మొదలుపెట్టాడు.

సూరత్ జిల్లా బార్డోలి తాలూకాలోని ఖర్వాసా అనే చిన్న గ్రామానికి చెందిన కుష్‌ గుర్రంపై స్కూలుకు వెళ్లడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇంత చిన్న వయసులోనే మహేశ్‌భాయ్ రాథోడ్ గుర్రంపై స్కూలుకు వెళ్లడం అద్భుతంగా ఉంది. ప్రతి రోజు, కుష్ తన ఇంటి నుండి గుర్రపు స్వారీ చేస్తూ పాఠశాలకు వస్తాడు. క్లాసుకి వెళ్లే ముందు గుర్రాన్ని స్కూల్ బయట కట్టేసి మేతవేస్తాడు. బైక్‌లు, బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో వచ్చే ఉపాధ్యాయులు సైతం కుష్‌కు గుర్రాలపై ఉన్న ప్రేమను చూసి విద్యార్థులు ఆశ్చర్యపోతున్నారు. కాసేపు గుర్రంతో ఆడుకుంటూ సంబరాలు కూడా చేసుకుంటారు.

కుష్ రాథోడ్  నాలుగేళ్లుగా గుర్రపు స్వారీ చేస్తూ పాఠశాలకు వస్తున్నాడు. ఖాళీ సమయంలో పాఠశాలలోని ఇతర విద్యార్థులు గుర్రానికి ఆహారం ఇస్తూ దానితో ఆడుకుంటారు. విద్యార్థి కుటుంబీకుల తెలిపిన వివరాల ప్రకారం, కుష్ ఒకసారి పొలంలో పనికి వెళుతున్నప్పుడు ఈ గుర్రం కనిపించింది. తనతో పాటు తెచ్చి పెంచుతున్నాడు. కుష్ ఎక్కడికి వెళ్లినా అది అతనికి తోడుగా ఉండేది. ఇప్పుడు కుష్‌ కూడా దానితోనే తిరుగుతున్నాడు.