రోహిత్ శర్మ అవుట్

రోహిత్ శర్మ అవుట్

ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్ లో భాగంగా పాక్ జట్టుతో తలపడుతున్న భారత ఓపెనర్లు పాక్ బౌలర్లను చితక్కొడుతున్నారు. వచ్చి రాగానే బ్యాట్ కు పని చెప్పారు. గతి తప్పిన బంతులను బౌండరీలకు తరలించడంతో పాక్ బౌలర్లకు ఏమి చేయాలో అర్థం కాకుండా పోయింది. కేవలం 4.2 ఓవర్లలో జట్టు స్కోరు హాఫ్ సెంచరీ సాధించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రధానంగా రోహిత్ శర్మ బ్యాట్ ఝులిపించాడు. ఇతనికి తోడుగా ఉన్న మరో ఓపెనర్ రాహుల్ కూడా ఆచితూచి ఆడాడు. కానీ ఈ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. జట్టు స్కోరు 54 పరుగుల వద్ద రోహిత్ శర్మ (28) వికెట్ కోల్పోయింది.

తొలుత టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ బ్యాటింగ్ కు దిగాల్సి వచ్చింది. రాహుల్, కెప్టెన్ రోహిత్ శర్మలు క్రీజులోకి వచ్చారు. వచ్చీ రావడంతోనే స్కోరు బోర్డును పరుగెత్తించేందుకు కృషి చేశారు. వీరిద్దరి భాగస్వామ్యంలో జట్టు స్కోరు హాఫ్ సెంచరీ దాటింది. ప్రస్తుతం క్రీజులో రాహుల్ 27 పరుగులు పాటు విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఇలాగే రాణిస్తే.. భారత్ భారీ స్కోరు సాధించే అవకాశాలున్నాయని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.