కస్తూర్బా స్కూల్ లో డుమ్మా కొట్టిన 9 మందికి షోకాజు నోటీసులు

కస్తూర్బా స్కూల్ లో డుమ్మా కొట్టిన  9 మందికి షోకాజు నోటీసులు

జగిత్యాల, వెలుగు : కస్తూర్బా రెసిడెన్షియల్ స్కూల్ లో పని చేసే 9 మంది స్టాఫ్​ సోమవారం రిజిస్టర్ లో సంతకాలు చేసి బర్త్ డే పార్టీ కోసం డుమ్మా కొట్టారు. వర్షాలతో బందయిన  స్కూల్స్ సోమవారం ప్రారంభమయ్యాయి. జగిత్యాలలోని ధరూర్ క్యాంప్ కస్తూర్బా స్కూల్ కు ఉదయం 20 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వచ్చారు. ఇందులో 13 మంది మొదటిషిప్ట్​లో పని చేయాల్సిఉండగా .. 9మంది సంతకాలు చేసి ప్రిన్సిపల్ మధులత ఇంట్లో బర్త్ డే పార్టీకి వెళ్లిపోయారు. దీంతో క్లాస్ లు నిర్వహించలేకపోయారు. వంట మనుషులు,  అటెండర్లతో పార్టీలో పని చేయించుకున్నట్టు విమర్శలు వచ్చాయి. ఈ విషయం తెలియగానే డీఈవో జగన్మోహన్ రెడ్డి ఒక టీం ను పంపి ఎంక్వైరీ చేయించారు. స్కూల్​రిజిస్టర్​ను పరిశీలించిన  ఫైనాన్స్, అకౌంట్స్ ఆఫీసర్ రమేశ్​,  జీసీడీవో అనుపమ రిజిస్టర్ లో సంతకాలు చేసిన 9 మంది గైర్హజరయినట్టు గుర్తించారు. 9 మందికి షోకాజు నోటీసులు ఇస్తామని, రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఈవో తెలిపారు.