భువనేశ్వర్: ఒడిషాలో విమాన ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తోన్న ఇండియావన్ ఎయిర్ విమానం శనివారం (జనవరి 10) రూర్కెలాకు10–15 కిలోమీటర్ల దూరంలో కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ సహా ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. విమానం రూర్కెలా నుంచి భువనేశ్వర్‌కు ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందగానే రెస్య్కూ టీమ్స్ ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
గాయపడ్డవారిని వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన విమానం కెసాసిటీ 9 సీట్లు కాగా.. ప్రమాదం సమయంలో ఫ్లైట్‌లో ఆరుగురు ప్రయాణికులు, ఒక పైలట్ సహా ఏడుగురు వ్యక్తులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. విమానం కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటి వరకు ప్రమాదానికి కారణమేంటనేది తెలియరాలేదని.. దర్యాప్తు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.
