తొమ్మిదేండ్ల పిల్లలు ఏం చేస్తుంటారు? బాగా అల్లరి చేస్తుంటరు. స్కూల్లో నాలుగో, ఐదో చదువుతుంటరు. కానీ నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టర్ డ్యాంకు చెందిన లారెంట్ సైమన్స్ అనే కుర్రాడు 9 ఏండ్లకే ఏకంగా డిగ్రీ పట్టా తీసుకోనున్నాడు! చిన్నప్పటి నుంచే బాల మేధావిగా పేరు తెచ్చుకున్న లారెంట్ ప్రస్తుతం ఈంధోవెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. మున్ముందు పీహెచ్డీ కూడా చేయాలని ఆలోచిస్తున్నాడు. ఇక ఈ బుడ్డోడి ఐక్యూ కూడా ఆ లెవెల్ లోనే మస్త్ ఉన్నది. మామూలుగా130 ఐక్యూ ఉంటేనే మేధావులంటారు. ఈ బుడ్డోడి ఐక్యూ మినిమం145 ఉందట. విషయం ఏదైనా ఇట్టే.. కరకరా నమిలి మింగేసి జీర్ణం చేసుకున్నంత ఈజీగా అర్థం చేసుకుంటున్నాడట. డిగ్రీ తర్వాత నెక్ట్స్ ఏంటీ? అంటే కాలిఫోర్నియాలో హయ్యర్ స్టడీస్‌కు వెళతానంటున్నాడు. ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలకు పోవాలని, మెడిసిన్ చదవాలని అనుకుంటున్నాడట.

