93 శాతం పెరిగిన యూనియన్​ బ్యాంక్​ లాభం

93 శాతం పెరిగిన యూనియన్​ బ్యాంక్​ లాభం

న్యూఢిల్లీ: పబ్లిక్​ సెక్టార్​ లెండర్​ యూనియన్​ బ్యాంక్‌ నికర లాభం​ ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్​లో 93 శాతం పెరిగి రూ.2,782 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం, వడ్డీయేతర ఆదాయాలు పెరగడం వల్ల ఈసారి లాభం బాగా వచ్చింది. మూడో క్వార్టర్​లో బ్యాంక్ రూ.2,244 కోట్ల లాభం సాధించింది. 2022 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023 ఆర్థిక సంవత్సరం లాభం 61 శాతం పెరిగి రూ.8,433 కోట్లకు చేరింది.

నికర వడ్డీ ఆదాయం వార్షికంగా 21.9 శాతం పెరిగి రూ.8,251 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ మార్జిన్​ 2.98 శాతం పెరిగింది. వడ్డీయేతర ఆదాయం 62.48 శాతం పెరిగి రూ.5,269 కోట్లకు ఎగిసింది. అడ్వాన్సులు 13.05 శాతం పెరిగి రూ.8.09 లక్షల కోట్లకు చేరుకున్నాయి. డిపాజిట్ల విలువ వార్షికంగా 8.26 శాతం పెరిగి 11.17 లక్షల కోట్లకు చేరుకుంది.  రూ. పది ముఖ విలువ కలిగిన షేరుకు రూ. మూడు చొప్పున డివిడెండ్​ చెల్లించాలని బ్యాంకు బోర్డు సిఫార్సు చేసింది.