
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని దాదాపు అన్ని సర్కారు స్కూళ్లలో కరెంట్ సౌకర్యం ఉంది. మొత్తం 93శాతం బడుల్లో ఎలక్ర్టిసిటీ ఫంక్షనింగ్లో ఉంది. కేంద్ర విద్యాశాఖ తాజాగా యూడైస్ ప్లస్ 2024–25 రిపోర్టును రిలీజ్ చేసింది. దీంట్లో విద్యార్థులు, టీచర్ల వివరాలతో పాటు ఫెసిలిటీస్ డేటాను బహిర్గతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మేనేజ్మెంట్ల పరిధిలో 43,154 స్కూళ్లుండగా, వాటిలో 74,57,851 మంది విద్యార్థులు పన్నెండో తరగతి వరకూ చదువుతున్నారు.
వీటిలో 3,57,911 మంది టీచర్లు పనిచేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం టీచర్, స్టూడెంట్ రేషియో 1:21 ఉండగా, ప్రతి స్కూల్లో యావరేజీగా 8 మంది టీచర్లు, 173 మంది స్టూడెంట్లున్నారు. స్టేట్లో 2245 బడుల్లో ఒక్క విద్యార్థి చేరలేదు. మరోపక్క 5001 బడుల్లో ఒక్క టీచరే పనిచేస్తున్నారు. తెలంగాణలో 41,845 బడుల్లో కరెంట్ సౌకర్యంగా ఉండగా, వాటిలో 41059 బడుల్లో అది వినియోగంలో ఉంది. రాష్ట్రంలో 30,057 సర్కారు విద్యాసంస్థలుండగా, 28802 స్కూళ్లలో విద్యుత్ సౌకర్యం ఉంది. దీంట్లో 28,031 ఫంక్షనల్ అవుతున్నాయి. ఎయిడెడ్లో 89.6%, ప్రైవేటులో 99.9%, కేవీలు, నవోదయ, ఇతర సెంట్రల్ గవర్నమెంట్ అన్ని బడుల్లో వందశాతం ఎలక్ర్టిసిటీ సౌకర్యం ఉంది. .
ఇంకొన్ని వివరాలు..
- స్టేట్లో 30 వేల సర్కారు బడుల్లో 25,234 (84%) స్కూళ్లలో కంప్యూటర్లున్నాయి. వీటిలో 15,902 (52.9%) బడుల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉంది.
- రాష్ట్రవ్యాప్తంగా 42,962 బడుల్లో వాటర్ సౌకర్యం ఉంది. దీంట్లో 29,891 (99.4%) సర్కారు స్కూళ్లలో వాటర్ ఫెసిలిటీ ఉంది.
- స్టేట్ లో 15,305 (50%) ప్రభుత్వ స్కూళ్లలో కిచెన్ గార్డెన్స్ ఉన్నాయి. నవోదయాల్లో 66.7%, కేంద్రీయ విద్యాలయాల్లో 51.4% ఉన్నాయి.
- మొత్తం 43వేల బడులుంటే వాటిలో 36 వేల స్కూళ్లలో మెడికల్ చెకప్ నిర్వహించారు.