మణిపూర్ లో టెన్త్​లో 93 శాతం పాస్

మణిపూర్ లో టెన్త్​లో 93 శాతం పాస్
  •  పదేండ్లలో ఇదే హయ్యెస్ట్ 

మణిపూర్ లో అల్లర్ల కారణంగా ఈ అకడమిక్ ఇయర్ అంతా సాఫీగా సాగనప్పటికీ, పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఈసారి 93 శాతానికి పైగా పాస్ పర్సంటేజీ నమోదైంది. ఇంఫాల్: మణిపూర్ లో అల్లర్ల కారణంగా ఈ అకడమిక్ ఇయర్ అంతా సాఫీగా సాగనప్పటికీ, పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఈసారి 93 శాతానికి పైగా పాస్ పర్సంటేజీ నమోదైంది. ఇది గత పదేండ్లలోనే అత్యధికం. 

2022లో 76 శాతం, 2023లో 82.82 శాతం పాస్ పర్సంటేజీ నమోదైంది. మణిపూర్ లో ఈ అకడమిక్ ఇయర్ నుంచి మార్కుల సిస్టమ్ తీసేసి, గ్రేడ్స్ సిస్టమ్ తీసుకొచ్చారు. పాస్ పర్సంటేజీ పెరగడానికి ఇదొక కారణమని అధికారులు పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో ఈ అకడమిక్ ఇయర్ అంతా అల్లర్లతోనే గడిచిపోయింది. ఇప్పటికీ వేలాది మంది స్టూడెంట్లు రిలీఫ్ క్యాంప్స్ లోనే ఉన్నారు.

 ఈ నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని, మార్కుల కోసం పోటీ పడొద్దని గ్రేడ్స్ సిస్టమ్ తీసుకొచ్చాం” అని అధికారులు తెలిపారు. కాగా, మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించిన పరీక్షలకు మొత్తం 37,547 మంది హాజరయ్యారు. వీరిలో 18,995 మంది అబ్బాయిలు, 18,552 మంది అమ్మాయిలు ఉన్నారు.