విద్యుత్​ సబ్సిడీలకు రూ.958.33 కోట్లు విడుదల

విద్యుత్​ సబ్సిడీలకు రూ.958.33 కోట్లు విడుదల

హైదరాబాద్, వెలుగు : విద్యుత్ ​శాఖకు మంగళవారం రూ.958.33 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ట్రాన్స్​కోకు అడ్మినిస్ట్రేటివ్ ​సాంక్షన్​ఇస్తూ సర్కారు జీవో ఇచ్చింది. 2024–25 బడ్జెట్ లో అగ్రికల్చర్, అనుబంధ విభాగాల సబ్సిడీ కోసం కేటాయించిన  రూ.2875 కోట్లలో రూ.958.33 కోట్లను రిలీజ్ చేసింది.