రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు చెరువులో మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. కొలనూరులోని కొత్తచెరువులో మత్స్యకారులు కొన్ని రోజులుగా చేపలు పడుతున్నారు. ఈ క్రమంలో శనివారం వారి వలలకు భారీ సంఖ్యలో చేపలు చిక్కగా అందులో రోహు రకం చేప 20 కిలోల బరువు ఉంది. దీంతో ఈ చేప చిక్కిన దుద్దేటి రాములు ఆనందం వ్యక్తం చేశాడు.
- కోనరావుపేట, వెలుగు
