
- తిరిగి అప్పగించిన గ్రామస్థులు
అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. కరోనా కారణంగా పనులు లేక, కుటుంబపోషణ భారమైన ఒక తల్లి కన్న బిడ్డనే అమ్మేందుకు ప్రయత్నించింది. ఆ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థలు దాన్ని అడ్డుకుని ఆ బిడ్డను మళ్లీ తల్లి దగ్గరికి చేర్చారు. అనంతపురం జిల్లా రొద్దం మండలంలో ఈ ఘటన జరిగింది. బూచెర్ల గ్రామానికి చెందిన ముత్యాలు, సునీతమ్మ అనే దంపతులు కూలీ పనులు చేసి జీనవం సాగిస్తున్నారు. ఎనిమిది నెలల కిందట వారికి ఆడపిల్ల పుట్టింది. కాగా.. మూడు నెలల నుంచి లాక్‌డౌన్ కారణంగా వారికి పనులు దొరకలేదు. దీంతో కుటుంబం అంతా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు సునీతమ్మ అనారోగ్యం పాలైంది. దీంతో బిడ్డకు పాలు అందించలేని స్థితిలో ఉంది. దీంతో ఆకలిని తీర్చేందుకు బిడ్డను భిక్షాటన చేసేవారికి అమ్మారు. అయితే విషయం తెలుసుకున్న గ్రామస్థులు దాన్ని అడ్డగించి బిడ్డను తల్లి దగ్గరికి చేర్చారు.