పాల్వంచ నుంచి శబరిమలకు సైకిల్ పై ప్రయాణం

పాల్వంచ నుంచి శబరిమలకు సైకిల్  పై ప్రయాణం
  • వృద్ధాప్యంలో పాల్వంచవాసి సాహసం 

పాల్వంచ,వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ రాహుల్ గాంధీ నగర్ కు చెందిన గూడవల్లి కృష్ణ 65 ఏళ్ల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా పాల్వంచ నుంచి శబరిమలకు సైకిల్ పై బయలుదేరారు. 45 రోజులు పాటు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న కృష్ణ తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ గా పనిచేసి ఐదేండ్ల కింద పదవీ విరమణ చేశారు.

 గతంలోనూ దేశంలోని పలు ప్రాంతాలకు సైకిల్ యాత్ర చేసిన కృష్ణ వృద్ధాప్యంలోనూ ఇరుముడి కట్టుకొని శబరిమలకు బయలుదేరి వెళ్లారు. ఆయనతోపాటు ఇల్లెందుకు చెందిన గుండా యుగరాజు కూడా వెళ్లారు  వారికి అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ బాధ్యులతో పాటు పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. 20 రోజులపాటు ఈ యాత్ర సాగుతుందని కృష్ణ తెలిపారు.