
ఒక్కోసారి సోషల్ మీడియాలో కనిపించే వీడియోలు నవ్వు తెప్పిస్తాయి. అలాంటిదే ఇది కూడా. ప్రవీణ్ కస్వాన్ అనే ఐఎఫ్ఎస్(ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అధికారి షేర్ చేశారు. అందులో ఒక పెద్ద ఏనుగు, మరో గున్న ఏనుగు రోడ్డు మీద వెళ్తున్న చెరుకు లోడు లారీకి అడ్డంగా నిలబడ్డాయి. డ్రైవర్ ఎంతసేపు హారన్ కొట్టినా పక్కకు తొలగలేదు. విషయం అర్థమై.. ఒకతను లోడు పైకి ఎక్కి, చేతికి అందినన్ని చెరుకు గడలు తీసుకుని పక్కన ఉన్న పచ్చికలో పడేశాడు. అలా నాలుగైదు సార్లు పడేస్తే.. అప్పుడు ఆ రెండు ఏనుగులు లారీకి దారి ఇచ్చాయి. ఈ వీడియో షేర్ చేసిన అధికారి వీడియోకి ‘ఈ ట్యాక్స్‌ని ఏమని పిలవాలి’ అంటూ ఫన్నీగా ట్యాగ్ చేశారు. దీనికి నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు.