రాజస్థాన్ ఎలక్షన్స్: ఓటు వేసేందుకు పెళ్లికొడుకు బ్యాండ్ బాజాతో వచ్చాడు

రాజస్థాన్ ఎలక్షన్స్: ఓటు వేసేందుకు పెళ్లికొడుకు బ్యాండ్ బాజాతో వచ్చాడు

రాజస్థాన్ అసెబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అక్కడక్కడ చిన్నచిన్న సంఘటనల మధ్య పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంవరకు 40.27 శాతం ఓటింగ్ నమోదు అయింది. థోల్పూర్ లో 46.30 శాతం, దౌసాలో 37.28 శాతం, జైపూర్ లో 40.32 శాతం, సీఎం గెహ్లాట్ నియోజకవర్గంలో 37.89 శాతం, జోధ్ పూర్ లో 37.68 శాతం ఓటింగ్ నమోదు అయింది. 

ఈ క్రమంలో రాజస్థాన్ ఎన్నికల్లో ఓపెళ్లికొడుకు బ్యాండ్ బాజా, బారాత్ తో ఓటు వేయడానికి వచ్చారు. పెళ్లి కొడుకుతో పాటు పెళ్లిబృందం కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చింది. ఈ సందర్భంగా వరుడు ఓటు ప్రాముఖ్యతను వివరించారు. పెళ్లికి ముందు అభివృద్ధికి ఓటేశానని చెప్పారు.

మరోవైపు ఝలావర్ లో కొత్త జంట కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరుడు సచిన్ , వధువు ప్రీతి ఓటింగ్ ప్రాధాన్యత ఇచ్చి పెళ్లి డ్రెస్సులో ఓటు వేయడానికి వెళ్లారు. కుటుంబ సమేతంగా ఓటే వేసేందుకు వచ్చారు ఈ నవదంపతులు.. ఓటు ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేశారు.