ఢిల్లీలో కుప్పకూలిన బిల్డింగ్

 ఢిల్లీలో కుప్పకూలిన బిల్డింగ్

దేశ రాజధాని ఢిల్లీలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. విజయ్ పార్క్.. భజరన్ పురా ప్రాంతంలో మార్చి 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఫైర్ డిపార్ట్ మెంట్ కు సమాచారం వచ్చింది. బిల్డింగ్ కూలిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఓ ఇరుకు సందులో.. కుడి వైపు ఉన్న బిల్డింగ్.. ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో కూలిపోయింది. ఎదురుగా ఉన్న ఇళ్లపై పడింది. ఈ ఘటనతో స్థానికులు అందరూ భయంలో పరుగులు తీశారు. ఇళ్లల్లోకి వెళ్లటానికి భయపడుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి మూడు ఫైరింజన్లు చేరుకున్నాయి. పోలీస్ బృందాలు చేరుకున్నాయి. బిల్డింగ్ శిథిలాల తొలగింపు ప్రక్రియ జరుగుతుంది. శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా అనేది పరిశీలిస్తున్నారు అధికారులు. 

ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా లేదా.. బిల్డింగ్ కూలిపోవటానికి కారణాలు ఏంటీ.. స్థానికులు ఏమంటున్నారు.. రద్దీగా ఉంటే ఓ స్లమ్ ఏరియాలో.. ఓ ఇరుకు సందులోని బిల్డింగ్ కూలిపోవటం వెనక ఏం జరిగింది.. ఇలాంటి విషయాలపై పోలీసులు ప్రకటన చేయాల్సి ఉంది.