ఔటర్‌ రింగ్‌ రోడ్‌పై లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

V6 Velugu Posted on Mar 23, 2021

హైదరాబాద్ : పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. లారీని ఎర్టిగా కారు వేగంగా ఢీకొట్టినట్టు తెలుస్తుంది. ప్రమాదంతో కారులోని ముగ్గురి డెడ్ బాడీలు ఇరుక్కుపోయాయి. స్థానికుల సాయంతో మృతదేహాలను బయటకు తీశారు పోలీసులు. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జైంది. హైదరాబాద్ కొత్తపేటకు చెందిన ఉపేంద్రనాథ్ , ప్రభాకర్ , రోషిత్ కారులో బాపట్ల నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగిందని చెప్తున్నారు పోలీసులు. వీరిలో ఇద్దరు తండ్రీ, కొడుకులు కాగా... ఒకరిని కారు డ్రైవర్ గా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన లారీ... అమరావతి నుంచి మెదక్ వెళ్తున్నట్టు సమాచారం. లారీ డ్రైవర్ కు ఓఆర్ఆర్ లో ఎలా వెళ్లాలో తెలియక పెద్ద అంబర్ పేట దగ్గర రోడ్ పై ఆపినట్టు తెలుస్తుంది. ఘటనా స్థలాన్ని వనస్థలిపురం ఏసీపీ పరిశీలించారు. 

Tagged Hyderabad, accident, killed

Latest Videos

Subscribe Now

More News