జమ్మూకాశ్మీర్​లో లోయలో పడిన కారు.. ఒకే ఫ్యామిలీలో 8 మంది మృతి

జమ్మూకాశ్మీర్​లో లోయలో పడిన కారు.. ఒకే ఫ్యామిలీలో 8 మంది మృతి

శ్రీనగర్:  జమ్మూ కాశ్మీర్‌‌లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. అనంత్‌‌నాగ్ జిల్లా దక్సమ్ ఏరియాలో ఓ కారు లోయలో పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలున్నారు. కారు( టాటా సుమో) కిష్త్వార్ నుంచి దక్సమ్ వస్తుండగా అదుపుతప్పి లోయలో పడిందని అధికారులు తెలిపారు. 

ప్రమాదంలో వెహికల్ పూర్తిగా నుజ్జునుజ్జయిందని చెప్పారు. స్థానికులిచ్చిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకుని  రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని..ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆఫీసర్లు పేర్కొన్నారు.