సిద్దిపేట జిల్లాలో బావిలో పడ్డ కారు

సిద్దిపేట జిల్లాలో బావిలో పడ్డ కారు

సిద్దిపేట జిల్లా: దుబ్బాక మండలం చిట్టాపూర్ ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన బావిలో పడింది. కారు బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. కారులో ఉన్నవారి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. రామాయంపేట నుంచి సిద్దిపేట వైపు కారు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.  బావి నుంచి నీటిని తోడివేస్తున్నారు. దాదాపు 45 నుంచి 60 లోతున బావి ఉంది. స్థానిక ఎమ్మెల్యే రఘనందన్ రావు అక్కడికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కారులో ఎంత మంది ఉన్నారో తెలియాల్సి ఉంది.