డిన్నర్​కు పిలిచి ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్

డిన్నర్​కు పిలిచి ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్

జూబ్లీహిల్స్, వెలుగు : బ్లాక్ మెయిల్​కు పాల్పడిన కిలాడీ లేడీపై జూబ్లీహిల్స్ పీఎస్​లో కేసు నమోదైంది.​ఎస్సై గోవర్ధన్​రెడ్డి తెలిపిన ప్రకారం.. భైరవపురం సినిమా నిర్మాత ఆశా మల్లికకు షూటింగ్​లో వెంకటగిరికి చెందిన అసిస్టెంట్ కెమెరామెన్ పుల్లంశెట్టి నాగార్జున బాబు (35) పరిచయం అయ్యాడు. షూటింగ్​పూర్తయిన తర్వాత నాగార్జునను ఆమె తన ఇంటికి డిన్నర్​కు ఆహ్వానించింది. అది కాస్త ఇరువురి మధ్య శారీరక సంబంధానికి దారి తీసింది. తాను తల్లిని అవుతున్నానంటూ నాగార్జున బాబుకు చెప్పింది. తన భర్తకు విడాకులు ఇచ్చేస్తానని, పెళ్లి చేసుకోవాలని అతడిని ఆమె కోరగా చిలుకూరి బాలాజీ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం తనకు డబ్బు కావాలంటూ రూ.18.50 లక్షలు అతడిని ఆమె అడగగా అకౌంట్​కు  నాగార్జున బాబు రూ. 10 లక్షలు ట్రాన్స్ ఫర్ చేశాడు.  అప్పటి నుంచి అతడిని బెదిరించసాగింది. నాగార్జున బాబు ఆస్తిలో వాటా ఇవ్వాలని ఆశామల్లిక బ్లాక్​మెయిల్​చేయడంతో అతడు జూబ్లీహిల్స్​పోలీసులకు మంగళవారం రాత్రి ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. కాగా.. ఏపీలోని గాజువాకకు చెందిన భరత్ అనే వ్యక్తిపై, శ్రీనివాస్​పై కూకట్​పల్లి, కార్తికేయపై నార్సింగ్​పీఎస్​లో ​కేసులు పెట్టింది. ఇదిలా ఉంటే  అప్పటికే ఆశా మల్లికకు రెండు పెండ్లీలు అయిన విషయం దాచిపెట్టింది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.