వ్యాపారి ఇంట్లో చోరీ కేసు.. మనస్తాపంతో దొంగ సూసైడ్

వ్యాపారి ఇంట్లో చోరీ కేసు.. మనస్తాపంతో దొంగ సూసైడ్

సికింద్రాబాద్, వెలుగు : యూపీకి చెందిన మోతీరావు కుటుంబం రెజిమెంటల్ బజారులో ఉంటోంది. అతని చిన్న కొడకు రాజేశ్​యాదవ్​ (26) డెల్​కాల్​సెంటర్​లో ఎంప్లాయ్ . అతడు డ్రగ్స్​కు అలవాటు పడి ఈజీగా  డబ్బు సంపాదించేందుకు చోరీలు ఎంచుకున్నాడు. రెండునెలల కిందట జూబ్లీహిల్స్​లోని ఓ వ్యాపారవేత్త ఇంట్లోకి చొరబడ్డాడు. 

గర్భవతి అయిన వ్యాపారి భార్య మెడపై కత్తిపెట్టి బెదిరించిన రాజేశ్​రూ.10లక్షలు దోచుకుని పారిపోయాడు. అప్పట్లో సంచలనం రేపగా..  జూబ్లీ హిల్స్​పోలీసులు కేసు నమోదు చేసి రాజేశ్​ను అరెస్టు చేసి చంచల్​గూడ జైలుకు పంపారు. జూన్ 30న బెయిల్​పై విడుదలయ్యాడు. అవమానంతో మనస్తాపానికి గురైన రాజేశ్ శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని టైమ్​లో​ఉరేసుకున్నాడు. 

వేర్వేరు కారణాలతో మరో ఇద్దరు..

మెహిదీపట్నం : తల్లి మందలించిందని కూతురు సూసైడ్​ చేసుకుంది. బంజారాహిల్స్ ఎన్​బీటీనగర్​కు చెందిన సుధీర్ కుమార్ భార్య గాయత్రి (31) ప్రభుత్వ టీచర్. వీరికి ఇద్దరు పిల్లలు. వానలు కురుస్తుండగా మంగళవారం మధ్యాహ్నం పిల్లలు బయటకు వెళ్లకుండా ఆమె తలుపు పెట్టింది. గాయత్రి తల్లి మహాదేవి పిల్లలను ఇంట్లోనే ఎందుకు పెట్టావని అడిగింది. దీంతో తల్లీకూతురికి కొంతసేపు వాగ్వాదం జరిగింది. గాయత్రి పిల్లలను తల్లి తీసుకుని పక్కనే ఉండే మరో కూతురు ఇంటికి వెళ్లింది. తీవ్ర మనస్తాపానికి గురైన గాయత్రి బెడ్రూంలో ఫ్యాన్​కు ఉరేసుకుని చనిపోయింది.
మూసాపేట : ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బంజెరి గ్రామానికి చెందిన  వేణు (24), కుటుంబంతో కలిసి సిటీకి వచ్చాడు. సేల్స్ మెన్ గా పని చేస్తూ మూసాపేట జనతానగర్ లో నివసిస్తున్నాడు. ఈనెల 2న  తన కొడుకు పుట్టిన రోజు సందర్భంగా కుటుంబంతో కలిసి సొంతూరికి వెళ్లాడు. వారం కిందట వేణు ఒక్కడే సిటీకి తిరిగొచ్చాడు. అతని బాబాయి రామారావు శుక్రవారం మధ్యాహ్నం ఫ్రెండ్ జోగారావు ఫోన్ చేసి వేణు ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడని చెప్పాడు. అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తితో వేణు సూసైడ్ చేసుకున్నట్టు రామారావు పోలీసులకు ఇచ్చిన కంప్లయింట్​లో పేర్కొన్నాడు.