యాంకర్ ప్రదీప్‌ మాచిరాజుపై కేసు నమోదు

యాంకర్ ప్రదీప్‌ మాచిరాజుపై కేసు నమోదు

టీవీ యాంకర్ ప్రదీప్‌ మాచిరాజుపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ప్రస్తుతం ప్రదీప్ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అయితే సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ నిబంధనలకు విరుద్ధంగా రెండు రోజుల జైలు శిక్ష అనుభవించిన ప్రదీప్‌ సినిమాలో నటిస్తుండటం,  నిబంధనలకి విరుద్దమని, ఈ సినిమా షూటింగ్ వెంటనే ఆపేయాలని శ్రీరామోజు సునిశిత్‌ అనే దర్శకుడు పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశాడు.

మేడ్చల్‌ జిల్లా కీసర సమీపంలోని రాంపల్లికి చెందిన సునిశిత్ పోలీసులకు ఫిర్యాదు చేసి అనంతరం మాట్లాడుతూ.. గత నెల 31న తాను టీవీ చూస్తుండగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాలో ప్రదీప్‌ మాచిరాజు ని చూశానని.. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ ఆపాలని ఆదేశాలు జారీ చేయాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు.

a case registered on TV Anchor Pradeep Machiraju at Banjara Hills Police Station