గ్రౌండులో టెంట్లు వేసి పోలింగ్.. హన్మకొండ జిల్లా ఆరేపల్లి పంచాయతీలో ఎన్నికల తీరు

గ్రౌండులో టెంట్లు వేసి పోలింగ్.. హన్మకొండ జిల్లా ఆరేపల్లి పంచాయతీలో ఎన్నికల తీరు

శాయంపేట, వెలుగు: గదులు సరిగ్గా లేకపోవడంతో గ్రౌండులోనే సర్పంచ్​ ఎన్నికలను నిర్వహించారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ఆరెపల్లిలో సర్పంచ్​తో పాటు రెండు వార్డులకు బుధవారం ఎన్నికలు జరిగాయి. అక్కడ ప్రైమరీ స్కూల్​ లో పోలింగ్​ బూత్​ ఏర్పాటు చేశారు. స్కూల్​లో ఒకే గది ఉంది. ఆరు వార్డులు ఉన్న గ్రామంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈ గది సరిపోకపోవడంతో గ్రౌండులో టెంట్లు వేసి పోలింగ్​కు ఏర్పాట్లు చేశారు.