నూతన హైకోర్టు భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలి : వికాస్ రాజ్

నూతన హైకోర్టు భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలి :  వికాస్ రాజ్
  •  అధికారులకు ఆర్ అండ్​ బీ శాఖ స్పెషల్​ సీఎస్ వికాస్ రాజ్ ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన హైకోర్టు భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ అధికారులను అదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులను పరిశీలించారు. సుమారు రూ.2,583 కోట్ల వ్యయంతో 36.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న హైకోర్టు భవనం రాష్ట్ర ఐకానిక్ బిల్డింగ్ లా ఉండాలని చెప్పారు. ఆఫీసర్లు అందుకు తగ్గట్టుగా మనసుపెట్టి పనిచేయాలని ఇప్పటికే  సీఎం రేవంత్ రెడ్డి, ఆర్ అండ్ బీ మినిస్టర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

‘పనుల్లో జాప్యం కలగకుండా ఉండటానికి, కన్సల్టెంట్లు డ్రాయింగ్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను ముందుగానే అందించాలి. దీనివల్ల కాంట్రాక్ట్ సంస్థ అవసరమైన సిబ్బందిని, యంత్రాలు, సామగ్రిని సిద్ధం చేసుకోవడానికి వీలవుతుంది. కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలి’ అని వికాస్ రాజ్​కాంట్రాక్ట్ సంస్థను ఆదేశించారు.