నిర్మల్ జిల్లాలో చెక్ డ్యాంను బాంబులతో పేల్చేశారు.. వీడియో వైరల్..!

నిర్మల్ జిల్లాలో చెక్ డ్యాంను బాంబులతో పేల్చేశారు.. వీడియో వైరల్..!

నిర్మల్ జిల్లాలో చెక్  డ్యాం ను బాంబులతో పేల్చడం వైరల్ గా మారింది. లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన చెక్ డ్యాంను బాంబులు పెట్టి పేల్చేయడం నిర్మల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గురువారం (మే 22) ఇరిగేషన్ అధికారులు చెక్ డ్యాంను బ్లాస్టింగ్ చేసి పేల్చేశారు.

అయితే  నిర్మల్ పట్టణంలోని జీఎన్అర్ కాలనీ  సమీపంలో  స్వర్ణ  వాగు పై నిర్మించిన చెక్  డ్యామ్  ను బ్లాస్టింగ్  తో పెల్చేశారు  ఇరిగేషన్ అధికారులు. చెక్  డ్యామ్ తో ‌  జీఎన్ అర్ కాలనీకి వరద ముప్పు ఉండటంతో పేల్చేశారు అధికారులు. 

ప్రతిఏటా  వర్షాకాలంలో   కాలనిలోకి భారీగా వరదనీరు చేరుతోంది. ఆ వరద ముప్పును తొలగించేందుకు అధికారులు చెక్ డ్యామ్ ను  పెల్చేశారు. 

చెక్ డ్యాం ను పేల్చుతున్నారనే సమాచారం తెలిసి స్థానికులు భారీగా చేరుకున్నారు. చెక్ డ్యాం ను పేల్చేయడం చూసేందుకు ఆసక్తితో అక్కడికి చేరుకున్నారు. కాలనీ ప్రజలకు వరద నుంచి ఉపశమనం కల్పించిన అధికారులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు కాలనీ వాసులు.