
హైదరాబాద్, వెలుగు: కిడ్స్ సైకిళ్లను అమ్మే బీటల్ బైక్స్ కస్టమర్ల ఇంటికే వచ్చి సైకిల్‌ను అమర్చుతామని ప్రకటించింది. బీటల్ బైక్స్ వెబ్‌సైట్ ద్వారా సైకిల్‌ను కొనేవారికి ఈ సర్వీస్‌ను కంపెనీ అందిస్తోంది. కిడ్స్ సైకిల్‌ను పూర్తిగా అసెంబుల్ చేసి అమ్మడం లేదు కాబట్టి, ఇంటికి వెళ్లాక వాటిని అమర్చుకోవడం కస్టమర్లకు పెద్ద కష్టంగా మారుతోందని బీటల్ బైక్స్ పేర్కొంది. కొంత మంది పేరెంట్స్ కిడ్స్ సైకిల్ బాక్స్‌ను దగ్గర్లోని సైకిల్ షాపుకి తీసుకెళ్లి అసెంబుల్ చేసుకుంటున్నారని అభిప్రాయపడింది. ‘ఇంటి దగ్గరే అసెంబుల్’ సర్వీస్‌తో సైకిల్ అసెంబుల్ ప్రాసెస్ గురించి కస్టమర్లు ఆందోళన పడాల్సిన పనిలేదని చెబుతోంది. బైక్ డెలివరీ అయ్యాక టెక్నీషియన్ కస్టమర్ల టైమ్ స్లాట్ బట్టి ఇంటికొచ్చి ఈ సైకిళ్లను అమర్చుతారు. 85 శాతం అసెంబుల్ అయిన సైకిళ్లను మాత్రమే డెలివరీ చేస్తామని కంపెనీ ఫౌండర్ యోగేష్ చౌహాన్ అన్నారు. మాన్యువల్ లేదా యూట్యూబ్ వీడియోల ద్వారా మిగిలిన బాగాన్ని అమర్చుకోవడం పేరెంట్స్‌కు ఈజీగా ఉంటుందని అన్నారు. ఈ మిగిలిన ప్రాసెస్‌ను పూర్తి చేయడానికి టైమ్ సరిపోని పేరెంట్స్ తమ హోమ్–అసెంబుల్ సర్వీస్‌ను వాడుకోవచ్చని చెప్పారు.