ఇంటికో కొబ్బరి మొక్క.. ములుగు జిల్లాలో వనమహోత్సవం

ఇంటికో కొబ్బరి మొక్క.. ములుగు జిల్లాలో వనమహోత్సవం

ములుగు(గోవిందరావుపేట), వెలుగు: ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం గాంధీనగర్ గ్రామస్తులు శుక్రవారం వనమహోత్సవం నిర్వహించారు. సర్పంచ్ బానోతు నిర్మల వెంకన్న, థాంసన్ రూటర్, మ్యాజిక్ కార్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఒక్క రోజే ఇంటికో మొక్క చొప్పున వెయ్యి కొబ్బకి మొక్కలు నాటారు. 

అనంతరం గ్రామంలో సంప్రదాయంగా కుట్లు, అల్లికలు, కుండలు తయారీ విధానాన్ని సంస్థ ప్రతినిధులు పరిశీలించి, అభినందించారు. కార్యక్రమంలో మ్యాజిక్​ కార్​సంస్థ ప్రతినిధి మౌనిక, ఎన్జీవో ప్రతినిధి  రఘు, 55 మంది ఐటీ ద్యోగులు పాల్గొన్నారు.