
వికారాబాద్ జిల్లా ఎన్నెపల్లిలో విషాద ఘటన వెలుగుచూసింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన డేవిడ్ అనే వ్యక్తి బొంరాస్ పేట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని భార్య ఎండోమెంట్ శాఖలో పనిచేస్తుంది. ఏం జరిగిందో తెలియదు కానీ, డేవిడ్ ఇంట్లో ఎవరూ లేని టైంలో ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.