తాను చనిపోతూ మరొకరికి ప్రాణం పోస్తున్న కానిస్టేబుల్

V6 Velugu Posted on Sep 15, 2021

హైదరాబాద్: తాను చనిపోతూ మరొకరికి ప్రాణం పోస్తున్నాడు బ్రెయిన్ డెడ్ అయిన ఓ కానిస్టేబుల్. ఖమ్మం జిల్లాకు చెందిన 34 ఏళ్ళ వీరబాబు.. కొండాపూర్ స్పెషల్ బ్రాంచ్‎లో కానిస్టేబుల్‎గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సెలవుపై సొంతూరుకు వెళ్లిన వీరబాబు.. ఈ నెల 12న వ్యక్తిగత పనుల నిమిత్తం బైకు మీద వెళ్తుండగా.. గొల్లగూడెం వద్ద ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరబాబుకు తీవ్రగాయాలయ్యాయి. దాంతో వీరబాబును మెరుగైన వైద్యం కోసం మలక్ పేటలోని యశోదా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుల చికిత్సకు వీరబాబు ఏమాత్రం స్పందించకపోవడంతో.. బ్రెయిన్ డెడ్ అయినట్లుగా వైద్యులు ధృవీకరించారు. అయితే వైద్యుల సూచన మేరకు వీరబాబు గుండె దానానికి కుటుంబసభ్యులు ఒప్పుకున్నారు. దాంతో నిమ్స్ వైద్యులు వీరబాబు గుండెను సేకరించి హార్ట్ ప్రాబ్లమ్‎తో ఉన్న మరో వ్యక్తికి అమర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం గుండెను సేకరించిన తర్వాత నిమ్స్‎కు తరలించేందుకు పోలీసులు మలక్ పేట నుంచి నిమ్స్ ఆస్పత్రి వరకు గ్రీన్ చానల్ ఏర్పాటుచేశారు. 

Tagged Hyderabad, Telangana, Heart Transplantation, Yashoda Hospital, nims, Malakpet, heart donation

Latest Videos

Subscribe Now

More News