
శిల్పారామంలో ఏర్పాటైన ఆల్ఇండియా క్రాఫ్ట్ మేళా అదుర్స్ అనిపిస్తుంది. వివిధ రాష్ట్రాల చేనేత హస్తకళా ఉత్పత్తులు ఆకట్టుకుంటుండగా.. సందర్శకులతో సందడిగా కనిపిస్తుంది. ఆదివారం భారీగా విజిటర్స్ తరలివచ్చారు. రాష్ట్రంతో పాటు కశ్మీర్, కర్ణాటక, గుజరాత్, ఏపీ, ఢిల్లీ, యూపీ, పశ్చిమబెంగాల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల హ్యాండ్లూమ్స్, జ్యూట్, టెర్రకోట, హ్యాండీ క్రాఫ్ట్స్ ఉత్పత్తులు స్టాల్స్‌లో అందుబాటులో ఉంచారు. వీకెండ్ లో భాగంగా హైదరాబాద్ అసోం అసోసియేషన్ ఆధ్వర్యంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. బిహు నృత్యం, అస్సామీ సంగీతం, దివంగత భూపేన్ హజారికా పాటలు ఆలపించగా సందర్శకులను అలరించాయి. వైదేహి సుభాష్ శిష్య బృందం భరతనాట్యం, సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ తంజావూర్ గారడీ గొంబే, మధ్య ప్రదేశ్ జానపద నృత్యాలు ఆకట్టుకున్నాయి.