ఈలలు వేయడం గ్యారెంటీ.. పవన్ ఉస్తాద్ భగత్‌‌సింగ్‌‌ సినిమా నుంచి క్రీజీ అప్‎డేట్

ఈలలు వేయడం గ్యారెంటీ.. పవన్ ఉస్తాద్ భగత్‌‌సింగ్‌‌ సినిమా నుంచి క్రీజీ అప్‎డేట్

హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ అభిమానుల ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్.. త్వరలోనే ‘ఉస్తాద్ భగత్‌‌సింగ్‌‌’గా రాబోతున్నారు. హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని  రూపొందిస్తున్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌‌కు సంబంధించిన షూటింగ్ పోర్షన్ పూర్తయింది. ఇతర నటీనటులతోనూ వీలైనంత త్వరగా షూట్ కంప్లీట్ చేస్తున్నారు.  తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్‌‌డేట్‌‌ అందించారు మేకర్స్.

 ఈ మూవీ ఫస్ట్ సాంగ్ ప్రోమోను డిసెంబర్ 9న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇందులో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ మూవ్స్ ఈలలు వేసేలా ఉంటాయని, అదిరిపోయే ఎనర్జీతో ఆయన కనిపించనున్నారని మేకర్స్ అనౌన్స్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ సాంగ్ కంపోజ్ చేయగా, భాస్కరభట్ల లిరిక్స్ అందించారని, విశాల్ దడ్లాని ఈ పాటను పాడినట్టు తెలియజేశారు. 

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్‌‌లో ఇంప్రెస్ చేశారు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్‌‌గా నటిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. సమ్మర్‌‌‌‌లో సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పవన్, హరీష్​ కాంబోలో ‘గబ్బర్ సింగ్’ తర్వాత రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.