తల వెంట్రుకలతో పర్యావరణం కాపాడుతున్నరు

తల వెంట్రుకలతో పర్యావరణం కాపాడుతున్నరు

తల వెంట్రుకలతో పర్యావరణం కాపాడుతున్నరు
బెల్జియంలో కట్ చేసిన హెయిర్స్​కు మస్త్​ డిమాండ్​
రీ సైకిల్ చేసి మ్యాట్​ల తయారీ
నీటి కాలుష్యాన్ని తగ్గిస్తదన్న ఎన్​జీవో

న్యూఢిల్లీ : అందరం హెయిర్​ కటింగ్​ చేసు కుంటాం. కట్ చేసిన వెంట్రుకలను బార్బర్​ షాపు అతను తీసుకెళ్లి చెత్త కుప్పలో లేదా నాలాలో పడేస్తడు. ఇలాంటి హెయిర్స్​కు విలువ ఉండదు. అదే రాలిన జుట్టుకు అయితే కొందరు ఇంపార్టెన్స్ ఇస్తారు. గ్రామాల్లో రాలిన జుట్టు తీసుకుని గంజులు, పైసలిస్తుంటారు. అయితే, కట్ చేసిన వెంట్రుకలకు మాత్రం బెల్జియంలో చాలా విలువ ఉంది. షాపుల్లో జమ అయిన హెయిర్స్​ను తీసుకెళ్లి ఎన్​జీఓకు ఇస్తుంటారు. వారు ఈ వెంట్రుకలను రీ సైకిల్ చేసి పర్యావరణాన్ని కాలుష్యం బారి నుంచి కాపాడుతుంటారు. అదెలా అంటే.. కర్బన ఉద్గారాలను అబ్జార్వ్ చేసే గుణం హెయిర్స్​కు ఉందని ఎన్​జీవో సభ్యులు చెబుతున్నారు. ప్రత్యేక యంత్రాల ద్వారా వెంట్రుకలను మ్యాట్ ఆకారంలో మారుస్తారు. ఇది పర్యావరణాన్ని కలుషితం చేసే చమురు, ఇతర హైడ్రోకార్బన్‌‌లను గ్రహిస్తుంది. లేదంటే బయో -కాంపోజిట్ బ్యాగ్‌‌లుగా తయారు చేస్తారు. కిలో వెంట్రుకలు 7 నుంచి 8 లీటర్ల (1.8 నుంచి 2.1 యూఎస్​ గ్యాలన్లు) చమురు, హైడ్రో కార్బన్​లను అబ్జార్వ్​ చేస్తుందని ప్రాజెక్టు కో ఫౌండర్​ పాట్రిక్​ జాన్సెన్​ చెప్పారు.

మురుగు నీరు చేరడంతో నదులు కలుషితం అవుతున్నాయని చెప్పారు. దీన్ని అరికట్టాలంటే మురుగు నీటిలో హెయిర్​ మ్యాట్​లు వేస్తే సరిపోతుందని తెలిపారు. ఇలా చేయడంతో నీటి కాలుష్యాన్ని అరికట్టొచ్చని వివరించారు. వీటిని లోకల్​గా తయారు చేస్తుండటంతో పనితీరు బాగుంటుందన్నారు. జట్టు శక్తివంతమైన లక్షణాలు కలిగి ఉంటుందని, కెరాటిన్​ ఫైబర్ కారణంగా నీటిలో కరిగి బాగా సాగుతుందని తెలిపారు. హెయిర్స్ కలెక్ట్​ చేసి ఇచ్చే వారికి కొంత డబ్బు కూడా ఇస్తామని చెప్పారు.